Talangana BJP: బీజేపీ 4వ జాబితా విడుదల.. ఫోన్లు చేసి నేతలకు సమాచారం..

తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుండగా.. బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. అయితే, పేర్లు ప్రకటించకుండా.. అభ్యర్థులకు ఫోన్లు చేసి నామినేషన్ వేసుకోవాల్సిందిగా నేతలకు సూచించింది పార్టీ అధిష్టానం.

New Update
Talangana BJP: బీజేపీ 4వ జాబితా విడుదల.. ఫోన్లు చేసి నేతలకు సమాచారం..

Telangana BJP Final List: తెలంగాణ శాసనసభ ఎన్నికల నాలుగో జాబితాను బీజేపీ గురువారం నాడు విడుదల చేసింది. ఒక్కొక్కరుగా అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. అభ్యర్థులను ఫోన్లు చేసి సమాచారం అందజేసింది. రేపు నామినేషన్లకు ఆఖరు రోజు కావడంతో ఉదయాన్నే వెళ్లి నామినేషన్లను దాఖలు చెయ్యాలని ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. వారంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. జనసేనకు 8 స్థానాలు పోగా మిగిలిన 11 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీరిలో 6 సీట్లను ఫైనల్ చేసింది. శుక్రవారం ఉదయంలోగా మిగతా 5 స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు.

అభ్యర్థులు వీరే..

1. మల్కాజిగిరి - రామచంద్రరావు
2. కంటోన్మెంట్ - కృష్ణ ప్రసాద్(మాజీ ఐపీఎస్)
3. శేరిలింగంపల్లి - రవి కుమార్ యాదవ్
4. పెద్దపల్లి - దుగ్యాల ప్రదీప్ కుమార్
5. సంగారెడ్డి - పులిమామిడి రాజు
6. నాంపల్లి - రాహుల్ చంద్ర
7. మేడ్చల్ - విక్రమ్ రెడ్డి

Also Read:

కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ..

మంత్రి కేటీఆర్‌కు ప్రమాదం.. గాయాలు..!

Advertisment
తాజా కథనాలు