Telangana Assembly Sessions: ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ లు, సీఎస్, డీజీపీ, అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం రైతు భరోసా (Rythu Bharosa) విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ కమిటీ సేకరించిన వివరాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. అలాగే పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: రేవంత్ సర్కార్ సంచలనం.. వాళ్ళనుంచి రైతుబంధు సొమ్ము వెనక్కి..
అలాగే జాబ్ క్యాలెండర్ ను (Job Calendar) సైతం ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. గతంలో అసెంబ్లీ సమావేశాలు హాజరు కానీ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈ సమావేశాలు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ఆసక్తి నెలకొంది.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే సరికి బీఆర్ఎస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోవడంపై బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసే అవకాశం ఉంది. ఇంకా జాబ్ క్యాలెండర్, అమలు కానీ గ్యారెంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.