Telangana Elections: తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ నామినేషన్ అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులు, కేసలు వివరాలను పేర్కొన్నారు.

New Update
Telangana Elections: తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..

Telangana Leaders Assets: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Elections) నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు తమ తమ నియోజకవర్గాల్లో నామినేషన్స్ ఫైల్ చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్య నేతలు చాలా మంది తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఈటల రాజేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రాజాసింగ్, పువ్వాడ అజయ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మా దేవేందర్ రెడ్డి వంటి ప్రముఖులంతా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్స్ ఫైల్ చేసిన నేతల్లో ముఖ్య నేతల ఆస్తులు, అప్పులు, వారిపై ఉన్న కేసుల వివరాలను ఓసారి తెలుసుకుందాం..

ఈటల రాజేందర్ - బీజేపీ అభ్యర్థి, గజ్వేల్ & హుజూరాబాద్

బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ గజ్వేల్, హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రెండు నియోజవకర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా ఈటల సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, కేసులకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. దీని ప్రకారం.. ఈటల పై 40 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కోవిడ్-19 ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు & చట్టవిరుద్ధంగా సమావేశాలు నిర్వహించడంపై ఉన్నాయి. ఇక ఆస్తుల పరంగా చూసుకుంటే.. గత ఆర్థిక సంవత్సరంలో ఈటల రాజేందర్‌ దంపతుల ఆదాయం రూ.1.6 కోట్లు ఉంది. ఈటల మొత్తం ఆస్తుల విలువ రూ. 53.3 కోట్లు.

publive-image

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - కాంగ్రెస్ అభ్యర్థి, నల్లగొండ

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దంపతుల సంవత్సర ఆదాయం రూ.1.8 కోట్లుగా ఉంది. కోమటిరెడ్డిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయనకు, ఆయన భార్యకు కలిపి రూ.11 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే రూ. 1.70 కోట్ల అప్పు ఉన్నట్లు పేర్కొన్నారు.

publive-image

పువ్వాడ అజయ్ - మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి - ఖమ్మం

పువ్వాడ అజయ్ ఆదాయం రూ.2.5 కోట్లు. 2014లో హైకోర్టు స్టే మంజూరు చేసిన AP ఎక్సైజ్ చట్టం కింద ఆయన కేసును ఎదుర్కొంటున్నారు. ఆయన, ఆయన భార్య పేరున రూ. 12 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 39 కోట్ల విలువైన స్థిరాస్తులను కలిగి ఉన్నారు. మొత్తంగా ఇద్దరి పేరిట 51.40 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక రూ.3.50 కోట్ల అప్పులున్నట్లు పేర్కొన్నారు.

publive-image

పల్లా రాజేశ్వర్ రెడ్డి - బీఆర్ఎస్ అభ్యర్థి-జనగాం

బీఆర్ఎస్ తరఫున జనగాం నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ ప్రకారం.. రాజేశ్వర్ రెడ్డి దంపతుల ఆదాయం ఏడాదికి రూ. 1.2 కోట్లుగా పేర్కొన్నారు. వీరికి రూ. 11.6 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 4.3 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.

publive-image

టి. జీవన్ రెడ్డి - ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అభ్యర్థి - జగిత్యాల

కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనపై సిఆర్‌పిసి 151 కింద 11 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. ఆయన, ఆయన భార్య ఇద్దరికీ కలిపి రూ. 2.8 కోట్ల స్థిరాస్తులు, రూ. 50 లక్షల చరాస్తులతో సహా మొత్తం రూ. 3.3 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

publive-image

పద్మా దేవేందర్ రెడ్డి - మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి

పద్మా దేవేందర్ రెడ్డి మంగళవారం నాడు తన నామినేషన్ దాఖలు చేశారు. ఈసీకి ఆమె సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. పద్మా దేవేందర్ రెడ్డి దంపతుల సంవత్సర ఆదాయం రూ. 42 లక్షలు. వీరికి రూ. 2.8 కోట్లు విలువైన చరాస్తులు, రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె వద్ద రూ. 90 లక్షల విలువైన బంగారం ఉంది.

publive-image

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి

పొంగులేటి మొత్తం ఆస్తి రూ. 440.23 కోట్లు. పొంగులేటి మొత్తం అప్పు రూ. 43 కోట్ల అప్పు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులిద్దరి వార్షిక ఆదాయం 3.7 కోట్లుగా పేర్కొన్నారు.

publive-image

Also Read:

అలా చేస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా: హైకమాండ్ కు జగ్గారెడ్డి ఫోన్

ఒకవేళ హంగ్ వస్తే తెలంగాణ లో పరిస్థితి ఏంటి? పార్టీల ప్లాన్ బీ ఎలా ఉంటుంది?

Advertisment
Advertisment
తాజా కథనాలు