/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Telangana-Elections-1-jpg.webp)
తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదలతో పాటు ఆ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దీంతో నామినేషన్లకు కేవలం 25 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. మరో 4 స్థానాలకు నేడో రేపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. వీటితో పాటే మైనంపల్లి పార్టీని వీడడంతో మల్కాజ్ గిరికి కూడా కొత్త అభ్యర్థిని ప్రకటించనున్నారు.
ఇది కూడా చదవండి:TS Elections 2023 Schedule: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న ఎన్నికలు.. ఇతర డేట్స్ ఇవే!
ఇంకా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఆయా పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేయడం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. దశల వారీగా ఆ పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే దాదాపు అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన అధికార బీఆర్ఎస్ కు ఇది కలిసివచ్చే అంశంగా మారింది. అయితే.. వచ్చే వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసి లిస్ట్ విడుదల చేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ ఫస్ట్ లిస్ట్ కూడా నేడో రేపు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:TS Congress Politics: హుటాహుటిన ఢిల్లీకి పొంగులేటి.. ఆ 15 సీట్ల కోసం పట్టు?
అయితే.. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ కు మిగతా పార్టీల అభ్యర్థుల ప్రకటన ఆలస్యం కావడం కలిసి వచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతేడాది కూడా ఇతర పార్టీలు అభ్యర్థులు ప్రకటించడం బాగా లేట్ చేయడంతో బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయ్యిందని వారు చెబుతున్నారు.