TS Elections 2023 Schedule: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న ఎన్నికలు.. ఇతర డేట్స్ ఇవే!

తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలను నిర్వహిచనున్నట్లు వెల్లడించింది. ఇతర రాష్ట్రాలకు వేర్వేరు తేదీల్లో ఎన్నికలు జరగనున్నా.. అన్ని రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3నే వెల్లడించనున్నారు.

TS Elections 2023 Schedule: మోగిన తెలంగాణ ఎన్నికల నగారా.. నవంబర్ 30న ఎన్నికలు.. ఇతర డేట్స్ ఇవే!
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ (Telangana Elections Schedule) విడుదలైంది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, ముగింపు, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలైంది. దీంతో ఆ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ 30న తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరగనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఒకే విడతలో తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 3న ప్రకటించనున్నారు. రాజస్థాన్ లో 23న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. మధ్యప్రదేశ్, మిజోరాంలో నవంబర్ 7న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది. ఛత్తీస్ ఘడ్ లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 7, 17 తేదీల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ డిసెంబర్ 3నే కౌంటింగ్ నిర్వహించనున్నారు.

publive-image

తెలంగాణ ఎన్నికల పూర్తి షెడ్యూల్:

నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 3

నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 10

నామినేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15

ఎన్నికల తేదీ: నవంబర్ 30

కౌంటింగ్‌: డిసెంబర్ 3

Press Note of 5 States General Election dated 09.10.2023

ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిందిన ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోగా.. మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. మిజోరాంలో 8.52 లక్షల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది, తెలంగాణలో 3.17 కోట్ల ఓటర్లు, ఛత్తీస్‌గఢ్‌ లో 2.03 కోట్లు రాజస్థాన్ లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఈ సారి వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే కల్పించినట్లు వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు పెరిగారని సంతోషం వ్యక్తం చేసింది ఈసీ. తెలంగాణలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ప్రతీ 897 మందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ వెల్లడించింది.

తెలంగాణ‌లో మొత్తం 119, రాజ‌స్థాన్‌లో 200, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో 90, మిజోరాంలో 40, మ‌ధ్యప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ శాసనసభ పదవీకాలం జనవరి 18న ముగియనుంది. ఇంకా.. మిజోరాం డిసెంబ‌ర్ 17, ఛ‌త్తీస్‌గ‌ఢ్ జ‌న‌వ‌రి 3, మధ్యప్రదేశ్ జ‌న‌వ‌రి 8, రాజ‌స్థాన్ అసెంబ్లీ పదవీ కాలం జ‌న‌వ‌రి 14న ముగియనుంది.

#ts-elections-2023-dates #telangana-assembly-elections-2023 #telangana-assembly-elections-2023-dates #telangana-elections-2023-schedule #telangana-elections-2023 #telangana-election-2023
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe