Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రేపు అంటే డిసెంబర్ 1వ తేదీన ప్రత్యేకంగా సెలవు ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈ సెలవు వర్తిస్తుందని ప్రకటించింది ఈసీ. అయితే, స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వర్తించదని స్పష్టం చేసింది. శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా యాధావిధిగా స్కూళ్లు, కాలేజీలు రన్ అవుతాయని తెలిపారు ఎన్నికల అధికారులు.
తెలంగాణ ఎన్నికల పోలింగ్ గురువారం నాడు ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల చిన్న చిన్న ఘటనలు మినహా.. పోలింగ్ అంతా సాఫీగా జరిగింది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర భద్రతా బలగాలు రాష్ట్రంలో పని చేశాయి. భద్రతా విధుల్లో BSF, CISF, ITBP, NSG, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, 65 వేల మంది తెలంగాణ పోలీసులు, 18 వేల మంది హోంగార్డులు పని చేశారు. మొత్తంగా 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల కోసం పని చేశారు.
Also Read:
హైదరాబాద్ ఓటర్ల మొద్దు నిద్ర..ఇప్పటికీ కేవలం 13 శాతమే పోలింగ్!