Telangana Elections: తెలంగాణలో ముగిసిన నామినేషన్‌ల స్వీకరణ గడువు.. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. 3వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవతగా.. నేటితో ఆ ప్రక్రియ ముగిసింది. నిన్నటి వరకు 2,474 నామినేషన్లు దాఖలయ్యాయి. By Shiva.K 10 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. శుక్రవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. తెలంగాణ శాసనసభకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగనుండగా.. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ తేదీ నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా.. 10వ తేదీని చివరి గడువుగా పేర్కొన్నారు. బీ-ఫామ్ సబ్మిషన్‌కు కూడా గడువు ముగిసింది. ఇప్పటి వరకు 2,644 నామినేషన్లు ఫైల్ అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇవాళ దాఖలైన నామినేషన్లతో కలిసి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, ఇవాళ నామినేషన్ల సమర్పణకు చివరి రోజు కావడంతో.. ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థులు సందడి చేశారు. తెలంగాణలో గురువారం సాయంత్రం వరకు 2,474 నామినేషన్లు దాఖలు అవగా.. చివరి రోజున ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదిలాఉంటే.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీ లోపు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఇదిలాఉంటే.. నామినేషన్ సమయంలో దాదాపు వంద మందికి పైగా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించలేదని అధికారులు చెబుతున్నారు. వీరందరికీ రిటర్నింగ్ అధికారులు.. నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకోనున్న 3.17 కోట్ల మంది ఓటర్లు.. కాగా, తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత జరుగుతున్న మూడో శాసనసభ ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాల వెల్లడించనుంది ఎన్నికల సంఘం. Also Read: లాస్ట్ మినిట్‌లో ట్విస్ట్.. మరో అభ్యర్థిని మార్చిన కాంగ్రెస్.. ఎవరంటే.. సీఎం జగన్ కారును ఢీకొన్న మరో కారు.. తృటిలో తప్పిన ప్రమాదం.. #telangana-politics #telangana-assembly-elections #telangana-elections-nominations మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి