/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Job-Mela-jpg.webp)
American Telugu Association : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) నిరుద్యోగులకు అదరిపోయే శుభవార్త చెప్పింది. ఈ నెల 18న వరంగల్ ఐటీ హబ్ లో జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాలో 23కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. టెక్ మహీంద్ర (Tech Mahindra), జెన్ ప్యాక్ట్ (Genpact), అపోలో , వరుణ్ మోటార్స్ తదితర ప్రముఖ సంస్థలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. జాబ్ మేళాలో ఈ సంస్థల్లో 2 వేలకు ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ గా ఆ మాజీ ఐఏఎస్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం?
విద్యార్హతలు: డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. 2021, 2022, 2023, 2024లో పాసైన వారికి అవకాశం ఉంటుంది.
ఇతర వివరాలు: అభ్యర్థులు పైన ఇచ్చిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. వివరాలకు [email protected] మెయిల్ ను సంప్రదించవచ్చు.
చిరునామా: Quadrant Office, ఐటీ సెజ్, మడికొండ, వరంగల్, తెలంగాణ, 506009.
సమయం: డిసెంబర్ 18, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు..
Good news for youngsters of Warangal & Hanamkonda
TTA is organizing a job Mela in Warangal @Quadranttech2 where 35 companies are going to recruit qualified youngsters
They are expecting to create anywhere from 1500 to 2000 jobs
Please do avail this opportunity pic.twitter.com/Ev6G1CzkFE
— KTR (@KTRBRS) December 13, 2023
కేటీఆర్ ట్వీట్: ఈ జాబ్ మేళా పోస్టర్ ను మంత్రి కేటీఆర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. హన్మకొండ, వరంగల్ ప్రాంతంలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.