Telangana: తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణలో 9 మంది ఐపీఎస్, ఐదుగురు నాన్ కేడర్ ఎస్‌పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. బదిలీ అయిన వారిలో విశ్వప్రసాద్, ఏవీ రంగనాథ్, ఎస్‌ఎం విజయ్ కుమార్, జోయల్ డేవిస్, రోహిణి ప్రియదర్శిని, ఎన్‌. శ్వేత, సుబ్బ రాయుడు, నితికపంత్‌, గజరావ్‌ భూపాల్‌ ఉన్నారు.

Telangana: తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ..
New Update

Telangana: తెలంగాణ రాష్ట్రంలో 9 మంది ఐపీఎస్‌ అధికారులు, ఐదుగురు నాన్‌ కేడర్‌ ఎస్‌పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే. ప్రస్తుతం హైదరాబాద్‌ ఎస్‌బీ జాయింట్‌ సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ట్రాఫిక్‌ అదనపు సీపీగా నియమించింది ప్రభుత్వం. అలాగే సిటీ, క్రైమ్స్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌ను నియమించింది. వెస్ట్‌జోన్‌ డీసీపీగా ఎస్‌ఎం విజయ్‌కుమార్‌ను నియమించింది. ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్న జోయల్‌ డేవిస్‌ను హైదరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా బదిలీ చేసింది సర్కార్.

నార్త్‌ జోన్‌ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమించిన ప్రభుత్వం.. ఆ స్థానంలో ఉన్న చందనాదీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసింది. అలాగే హైదరాబాద్‌ డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ డీసీపీగా ఎన్‌. శ్వేతను నియమించింది ప్రభుత్వం. హైదరాబాద్‌ ట్రాఫిక్‌-1 డీసీపీగా సుబ్బ రాయుడు ని నియమించింది. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్‌ డీసీపీగా ఉన్న నితికపంత్‌ సీసీఎస్‌ సీపీగా పోస్టింగ్ ఇచ్చింది. సీసీఎస్ జాయింట్‌ సీపీగా ఉన్న గజరావ్‌ భూపాల్‌లను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

నాన్‌ కేడర్‌ ఎస్‌పీలు..

రాష్ట్రంలో ఐదుగురు నాన్‌ కేడర్‌ ఎస్‌పీలను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ-3గా వెంకటేశ్వర్లును నియమించారు. ఆ స్థానంలో ఉన్న డి.శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది. రాచకొండ రోడ్‌ సేఫ్టీ డీసీపీగా ఉన్న బాలదేవిని హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ, మాదాపూర్‌ డీసీపీ గా నియమించారు. మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్‌ను రైల్వే ఎస్‌పీ అడ్మిన్‌గా నియమించారు. రైల్వే ఎస్‌పీ అడ్మిన్‌గా ఉన్న రాఘవేందర్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసినట్లు హోం శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Also Read:

తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే.. అమిత్ షా ఇంట్రస్టింగ్ కామెంట్స్..

ఒక్క క్లిక్‌తో అభయహస్తం అప్లికేషన్ ఫామ్.. మీ మొబైల్‌లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

#telangana-ips-officers-transfer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe