Telangana: ఆటో, క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్‌కి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..

గిగ్ వర్కర్లకు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆటో, క్యాబ్ డ్రైర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి రూ. 5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు.

Telangana: ఆటో, క్యాబ్ డ్రైవర్స్, డెలివరీ బాయ్స్‌కి సీఎం రేవంత్ బంపర్ ఆఫర్..
New Update

Telangana CM Revanth Reddy: క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్‌లు, ఆటో డ్రైవర్ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురావడంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 4 నెలల క్రితం స్విగ్గి డెలివరీ బాయ్ కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన ఘటనలో మృతుడి కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశించారు సీఎం. అదేవిధంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరిగా టీ హబ్ ద్వారా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్ల సమస్యలను తెలుసుకోవడానికి నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలనుం పరిగణనలోకి తీసుకుంటుమన్నారు. సామాజిక రక్షణ కల్పించడంలో మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఆ క్రమంలో విధాన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందుకోసం రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు.

“సంస్థలు కూడా కేవలం లాభాపేక్ష మాత్రమే చూడకుండా.. కార్మికులు, ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. గివ్ అండ్ టేక్ పాలసీ ని పాటించని ఎంత పెద్ద సంస్థలపైనైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాబోం. 4 నెలల క్రితం స్విగ్గి బాయ్ కుక్క తరిమితే భవనం పై నుంచి పడి మృతి చెందాడు. అప్పటి ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా సాయం అందిస్తారని ఆనాడు చూశా.. కానీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగిన సమయంలో మానవత్వంతో వ్యవహరించాలి. అందుకే ఆ కుటుంబం వివరాలు సేకరించి సీఎం సహాయనిది నుంచి ఆ కుటుంబానికి రూ. 2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన గ్రామసభలు నిర్వహిస్తున్నాం అక్కడ దరఖాస్తుల్లో మీ వివరాలు అందించండని క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ లు, ఆటో డ్రైవర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. డిజిటల్, మాన్యువల్ ఏ రూపంలోనైనా దరఖాస్తులు ఇవ్వొచ్చు అన్నారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహిస్తాం. ప్రజా వాణిలో వచ్చిన దరఖాస్తులను అన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రెటరీలు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, మాధుయాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితర నేతలు పాల్గొన్నారు.

Also Read:

కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్ ఫామ్ ఇవే..!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ బ్రిడ్జి మూసివేత.. ప్రత్యామ్నాయ రూట్ ఇదే!

#telangana-news #telangana-cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe