Hyderabad: భాగ్యనగరంలో 'డబుల్' పండుగ.. రేపే 11,700 ఇళ్లను పంపిణీ చేయనున్న సర్కార్..

పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒకే రోజు 11,700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేయనుంది ప్రభుత్వం.

New Update
Hyderabad: భాగ్యనగరంలో 'డబుల్' పండుగ.. రేపే 11,700 ఇళ్లను పంపిణీ చేయనున్న సర్కార్..

Double Bedroom Housing Scheme in Hyderabad: పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశలవారీగా పేదలకు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదీన గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఒకే రోజు 11,700 గృహాలను 24 నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు వివరాలను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శనివారం ఉదయం 11 గంటలకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. అందుకు సంబంధించిన ఇంటి ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. లాటరీ ప్రాతిపదికన ఎంపిక చేసిన అభ్యర్థులకు నగరంలో తొమ్మిది చోట్ల ఇళ్లకు సంబంధించిన పట్టాలను ఇస్తామని వివరించారు మంత్రి. ఇప్పటికే ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను కేటాయిస్తామని వివరించిన ఆయన.. ఏ నియోజకవర్గంలో ఎవరు పంపిణీ చేస్తారో వివరాలు వెల్లడించారు. మంత్రి హరీష్ రావుతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ విజయ లక్ష్మి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తారని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇక లబ్ధిదారులను తీసుకువచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేశామన్నారు.

లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్. మొదటి దశలో ఇళ్లు రాని వారు బాధపడొద్దని, దశల బారీగా పేదలందరికీ ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు మంత్రి.

ఏ నియోజకవర్గంలో ఎవరి చేతుల మీదుగా డబుల్ ఇళ్లను పంపిణీ చేయనున్నారో ఇప్పుడు చూద్దాం..

⇒ మేడ్చల్‌ నియోజకవర్గంలోని ప్రతాప్‌సింగారంలో- డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌

⇒ పటాన్‌చెరు నియోజకవర్గంలోని కొల్లూర్‌-1లో- మంత్రి హరీశ్‌ రావు

⇒ మహేశ్వరం నియోజకవర్గం మంఖాల్‌లో- మంత్రి సబితా ఇంద్రెడ్డి

⇒ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో- మహమూద్‌ అలీ

⇒ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్ల- మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్

⇒ మేడ్చల్‌ నియోజకవర్గంలోని అహ్మద్‌గూడ- మంత్రి మల్లారెడ్డి

⇒ రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని నార్సింగి, బైరాగిగూడలో- మంత్రి మహేందర్‌ రెడ్డి

⇒ ఉప్పల్‌ నియోజకవర్గంలోని శ్రీనగర్‌ కాలనీలో- మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్.. 

Also Read: 

Advertisment
తాజా కథనాలు