ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రైతులను ఈ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. రైతు భరోసాలో ఆంక్షలు పెట్టపోతున్నట్లు చెప్పి వారి మోసాన్ని బయటపెట్టారన్నారు. ఒక్క పథకంపై కూడా స్పష్టత లేదని ధ్వజమెత్తారు. యాదవుల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన గొర్రెల పెంపకం పథకాన్ని మూసివేసినట్లుగా అర్థం అవుతోందన్నారు. దళితబంధు పథకం ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. మత్స్యకారులకు కూడా భరోసాలేదన్నారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం కూడా తేలేదన్నారు. మహిళలకు లక్షకోట్లు ఇస్తున్నట్లు అబద్ధాలు చెప్పారన్నారు. రుణాలను కూడా వాళ్లు ఏదో ఇస్తున్నట్లు చెప్పారని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Minister Seethakka: బీజేపీ మెప్పు కోసమే.. కేసీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
రైతులకు తాము ఇచ్చిన డబ్బులను ఏదో ఆగం చేశామని దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. రైతులను, వృత్తి కార్మికులను ప్రభుత్వం వంచించిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలు ఏంటనే అంశాలపై ప్రకటన లేదన్నారు. చిల్లర మల్లర ప్లాట్ ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్పా.. బడ్జెట్ ప్రసంగంలా లేదన్నారు. ప్రభుత్వం తమ లక్ష్యం, టార్గెట్ ఏంటో చెప్పలేదన్నారు. ఇది పేదల, రైతులు.. ఎవరి బడ్జెట్ కాదన్నారు. భవిష్యత్ లో ఈ అంశంపై చీల్చిచెండాడుతామన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Budget 2024: వ్యవసాయానికి పెద్దపీట.. చరిత్రలోనే తొలిసారిగా ఎన్ని వేల కోట్లంటే?