Hanuman Official Trailer: యంగ్ హీరో తేజ సజ్జ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ (Teja Sajja) కాంబినేషన్ లో రాబోతున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం జాంబీ రెడ్డి. ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే విడుదలైన ”హనుమాన్’ టీజర్ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 న విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Hanuman Official Trailer: తేజ సజ్జ ‘హనుమాన్’ ట్రైలర్.. ‘ధర్మం కోసం పోరాడే ప్రతీఒక్కరితో హనుమాన్ ఉంటాడు’
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'హనుమాన్'. 2024 జనవరి 12న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ చేశారు. 'కలియుగంలో ధర్మం కోసం పోరాడే వారి వెంట హనుమాన్ ఉంటాడు' అనే డైలాగ్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
Translate this News: