/rtv/media/media_files/2026/02/28/train-toilet-update-26-2026-02-28-21-59-41.jpg)
దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 1, 2026 నుండి అంటే రేపటి నుంచి 'సిమ్ బైండింగ్' (SIM Binding) నియమాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్ వంటి యాప్‌లన్నింటికీ ఇది వర్తిస్తుంది.
సిమ్ బైండింగ్ అంటే ఏంటి?
అసలు ఈ సిమ్ బైండింగ్ అంటే ఏంటి? అనే విషయానికొస్తే.. ఇప్పటివరకు మన ఫోన్ నెంబర్‌తో ఒక్కసారి వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్నాక.. ఆ నంబర్ సిమ్ కార్డు ఫోన్లో లేకపోయినా వాట్సాప్ యాప్ పనిచేసేది. కానీ ఇకపై అలా కుదరదు. రేపటి నుంచి రాబోతున్న కొత్త నియమం ప్రకారం.. మీరు ఏ నంబర్‌తో వాట్సాప్ ఖాతాను ఓపెన్ చేశారో, ఆ యాక్టివ్ సిమ్ కార్డు ఖచ్చితంగా అదే ఫోన్లో ఉండాలి. సిమ్ కార్డు ఫోన్లో లేకపోతే యాప్ పనిచేయదు.
కొత్త రూల్స్ వల్ల మార్పులు:
యాప్ పనితీరు: మీరు ఫోన్ నుండి సిమ్ కార్డు తీసేస్తే, వెంటనే వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఇది హ్యాకర్లు మీ నంబర్‌ను వేరే పరికరంలో ఉపయోగించకుండా నిరోధిస్తుంది.
వాట్సాప్ వెబ్: డెస్క్‌టాప్ లేదా వెబ్‌లో వాట్సాప్ వాడుతున్నప్పుడు, భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ (Log Out) అవుతుంది. మీరు మళ్ళీ క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
సైబర్ భద్రత: ప్రభుత్వం ప్రకారం, ఈ విధానం వల్ల సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం చాలా సులభమవుతుంది. యూజర్ల భద్రత కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ఎటువంటి సడలింపులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Follow Us