Twitter Down: ట్విట్టర్ X డౌన్.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న వినియోగదారులు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను నివేదిస్తున్నారు.

New Update
Twitter x Down several users report disruption

Twitter x Down several users report disruption

ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్) తాజాగా (మంగళవారం) భారతదేశంలో స్తంభించిపోయింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ట్విట్టర్ ఎక్స్ ప్లాట్ ఫార్మ్ నిలిచిపోవడంతో వేలాది మంది వినియోగదారులు అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్, డౌన్‌డెటెక్టర్‌లో X తో సమస్యలను పంచుకుంటున్నారు.  

Twitter x Down

భారతదేశంతో పాటు, USలోని మిలియన్ల మంది వినియోగదారులు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఇలా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఈ ప్లాట్‌ఫామ్‌ ఓపెన్ కాకపోవడంతో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. 

image (43)

ఇలా చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పనిచేయడం లేదని మొర్రోమంటున్నారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటల నాటికి.. అనేక మంది X వినియోగదారులు యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడిప్పుడే కొందరికి ఓపెన్ అవుతుండగా.. మరికొందరికి ఇంకా యాక్సస్ లభించలేదు.

పనిచేయకపోవడానికి కారణం ఇదే

కాగా ట్విట్టర్ X సరిగ్గా పనిచేయకపోవడానికి మొదటి కారణం క్లౌడ్‌ఫ్లేర్‌లోని సాంకేతిక సమస్య అని తెలుస్తోంది. ఇప్పటికీ ఈ సమస్యపై X ప్లాట్ ఫార్మ్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

ఈ సమస్యపై పలువురు వినియోగదారులు స్పందిస్తున్నారు. ‘‘X తో సహా అనేక వెబ్‌సైట్‌లు అంతరాయం కారణంగా డౌన్ అయ్యాయి. డౌన్ డిటెక్టర్ కూడా డౌన్ అయింది’’ అని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు. మరొక యూజర్ ‘‘X ఇప్పుడే ఒక నిమిషం పాటు డౌన్ అయింది. క్లౌడ్‌ఫ్లేర్‌లోని వారి హోస్ట్ సర్వర్ కూడా డౌన్ అయింది. క్లౌడ్‌ఫ్లేర్ సమస్యల కారణంగా x డౌన్ అయినట్లు కనిపిస్తోంది.’’ అని తెలిపాడు.

  • Beta
Beta feature
Advertisment
తాజా కథనాలు