Apple MacBook: ఆపిల్ మ్యాక్‌బుక్‌ భారీ అప్‌డేట్.. ఇప్పుడు సరికొత్త M5 చిప్‌తో..!

ఆపిల్ త్వరలో M5 చిప్ తో కొత్త MacBook Pro విడుదల చేయనుంది. మార్కెటింగ్ హెడ్ గ్రేగ్ జోస్వియాక్ “ఏదో శక్తివంతమైనది వస్తోంది” అని తన X పోస్ట్ లో పేర్కొన్నారు. కొత్త మోడల్ డిజైన్ పెద్దగా మారకపోయినా, పనితీరు, సమర్ధతలో భారీ మెరుగుదల ఉంటుందని అంచనా.

New Update
Apple MacBook:

Apple MacBook:

Apple MacBook: ఆపిల్ తాజాగా ఒక కొత్త MacBook Pro ను త్వరలో విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చింది. ఆపిల్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్రేగ్ జోస్వియాక్ X (Twitter)లో ఒక పోస్ట్ ద్వారా "ఏదో శక్తివంతమైనది వస్తోంది" అని చెప్పారు. దానితో పాటు MacBook Pro సొగసైన సిల్వెట్ చూపించే యానిమేషన్ కూడా పెట్టారు. ఈ వీడియోతో, ఆపిల్ M5 చిప్(M5 Chip) ఆధారంగా కొత్త MacBook వచ్చే అవకాశంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Also Read: Amazon Offer: ఆఫరండీ బాబు.. రూ.6 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. దిమ్మతిరిగే ఫీచర్లు!

వీడియోలోని MacBook సిల్వెట్ “V” ఆకారంలో ఉండటం, ఇది రోమన్ నంబర్ 5 కు సంకేతంగా భావిస్తున్నారు. జోస్వియాక్ పోస్ట్‌లో ఐదు Mలుగా కనిపించే క్యాప్షన్ కూడా కొత్త M5 చిప్ కి సూచన అని అర్థం చేసుకోవచ్చు. ఆపిల్ ఇటీవల MacBook Air, iPhone Airలో తీసుకొచ్చిన “స్కై బ్లూ” రంగు కూడా ఈ యానిమేషన్ లో కనిపించటం, MacBook Proకి కూడా ఈ కొత్త రంగు కలవచ్చేమో అని సంకేతాలు కలిగిస్తోంది.

బ్లూమ్‌బర్గ్, ఇతర వార్తాసంస్థల ప్రకారం, ఆపిల్ త్వరలో 14 అంగుళాల MacBook Proని M5 ప్రాసెసర్‌తో విడుదల చేయనున్నది. అలాగే అప్డేటెడ్  iPad Pro, Vision Pro హెడ్సెట్ వంటి పలు పరికరాలు కూడా అదే చిప్ ఆధారంగా వచ్చేవి. మొదట మామూలు M5 MacBook Pro వస్తుందని అనుకున్నారు, కానీ M5 Pro, M5 Max మోడల్స్ కోసం వచ్చే సంవత్సరం వరకు ఆగాల్సిందే.

కొత్త MacBook Pro డిజైన్ లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని ప్రస్తుతం లీకైన వివరాలు చెబుతున్నాయి. కొత్త చిప్ ద్వారా పనితీరు, సమర్ధత పెరిగే లాగా ఆపిల్ దృష్టి సారిస్తోంది. కాబట్టి, డిజైన్ అంతగా మారకపోవచ్చు.

ఆపిల్ తరచూ తమ Teasers ద్వారా పెద్ద ప్రకటనలు చేస్తుంది. ఈసారి కూడా పలు కొత్త గాడ్జెట్స్, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, Apple TV, HomePod mini మోడల్స్ వంటి ఉత్పత్తుల విడుదలకు తయారవుతోంది. 2025 చివరికి ఆపిల్ బలమైన హార్డ్వేర్ లైన్ అప్ ని ప్రేక్షకులకు అందజేస్తుందని అంచనా.

అయితే, వీటి విడుదల తేదీల గురించి ఆపిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ "ఏదో శక్తివంతమైన వస్తోంది" అనే గ్రేగ్ జోస్వియాక్ మాటలు త్వరలో విడుదల ఖాయం అని తెలియజేస్తున్నాయి. MacBook Pro ఈ కొత్త తరహా విడుదల కోసం అభిమానులు పెద్దగా ఎదురుచూస్తున్నారు, ముఖ్యంగా తమ పాత మోడల్‌ను మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నవారికి.

మొత్తానికి, ఆపిల్ కొత్త M5 చిప్‌తో MacBook Pro ను సరికొత్త పనితీరు, సమర్ధతతో త్వరలో ప్రేక్షకుల ముందుకు తెస్తోంది. కొత్త రంగులు, మోడల్స్ కూడా ఈసారి ఉండొచ్చు. త్వరలోనే ఆపిల్ అభిమానులు, టెక్ ప్రపంచం ఈ సంచలనాన్ని చూడనున్నారు.

Advertisment
తాజా కథనాలు