WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది.

New Update
WhatsApp : వాట్సాప్ లో.. స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్

WhatsApp : ఇంట్లో ఖాళీగా కూర్చొని ఫోన్ చూసే సమయంలో రకరకాల మెసేజ్ లు, వీడియోలు కనిపిస్తుంటాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా? అయితే  నెలకు వేలల్లో, లక్షల్లో సంపాదించుకోండి, ఒక్క క్లిక్ చేస్తే లక్ష రూపాయలు వస్తాయి, మీరు 5 లక్షల లోన్ పొందే అవకాశం గెలుచుకున్నారు.. అంటూ ప్రతిరోజు ఫోన్ లో అనేక మెసేజ్ లు వస్తుంటాయి. ఇక ఈ మెసేజ్ లతో కొంతమంది విసిగిపోగా, మరికొంత మంది నిజమా.? అబద్దమా అనే అయోమయంలో ఉండిపోతారు. కొన్ని సందర్భాల్లో తెలియక వాటిని నొక్కేసి డబ్బులు కోల్పోయిన అమాయకులు కూడా ఉంటారు.

స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్

ఇక ఇప్పుడు ఈ సమస్యకు ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ పరిష్కారాన్ని కనిపెట్టింది. ఏది స్కామ్‌, ఏది స్పామ్‌? దేన్ని నమ్మాలి.. దేన్ని నమ్మకూడదో తెలియక సైబర్ మోసాలకు గురవుతున్నసెల్ ఫోన్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ సెక్యూరిటీ ఫీచర్ ఫోన్ లో వచ్చే అవాంఛిత సందేశాలలో ఏది నిజం.. ఏది అబద్దం అనే అయోమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వాబీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్ ను మొబైల్ ఫోన్లలో ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని అకౌంట్స్ నుంచి వచ్చే సందేశాలను ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సెక్యూరిటీ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్పామ్ ఫీచర్ ను ఫోన్ లో ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం..

స్పామ్ బ్లాకింగ్‌ ఫీచర్ ను ఎనేబుల్ చేసే విధానం 

Step 1: ముందుగా వాట్సప్ ఓపెన్ చేసి కుడి వైపు భాగంలో ఉన్న 3 డేట్స్ పై క్లిక్ చేయండి.

Step 2: ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకొని.. Privacy పై క్లిక్ చేయండి

Step 3: ప్రైవసీ ఆప్షన్ పై క్లిక్ చేసి కాస్త కిందకి వెళితే Advanced అనే ఆప్షన్ ఉంటుంది దానిపై నొక్కండి.

Step 4: ఇప్పుడు Protect IP address in calls అని ఆప్షన్ ఉంటుంది దానిని ఎనేబుల్ చేయండి. అంతే దీనిని ఎనేబుల్ చేయడం ద్వారా స్పామ్ మెసేజెస్లను ఆటోమేటిక్ గా బ్లాక్ చేస్తుంది.

Also Read: Sudheer Babu: ప్రభాస్‌ ముందు మీరు బచ్చాలు..! బాలీవుడ్‌ నటుడికి ఇచ్చిపడేసిన సుధీర్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు