India Cricket: భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా

ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆదరగొడుతోంది. ఓపెనింగ్‌ జోడీ, వన్‌డౌన్‌, మిడిలార్డర్‌ ఇలా అన్ని విభాగాల్లో బ్యాటర్లు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఓపెనర్లు విఫమైతే మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు.

New Update
India Cricket: భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా

ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్న ఆసియా కప్‌లో టీమిండియా ఆదరగొడుతోంది. ఓపెనింగ్‌ జోడీ, వన్‌డౌన్‌, మిడిలార్డర్‌ ఇలా అన్ని విభాగాల్లో బ్యాటర్లు తమదైన శైలిలో చెలరేగిపోతున్నారు. మరోవైపు ఓపెనర్లు విఫమైతే మిడిలార్డర్‌ బ్యాటర్లు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ట్‌ సెంచరీల అనంతరం రోహిత్‌, గిల్‌ ఫెవిలీయన్‌ చేయగా.. అనంతరం వచ్చిన బ్యాటర్లు విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ చెలరేగిపోయారు. దీన్ని బట్టి చూస్తే అర్దమవుతోంది. భారత బ్యాటర్లు ఎలా ఆడుతున్నారో.

అనంతరం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత టాప్‌ ఆర్డర్ చేతులెత్తేసినా బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ నెలకొల్పిన భాగస్వామ్యం కీలకంగా మారింది. ఈ జోడి తక్కువ భాగస్వామ్యమే నెలకొల్పినా టీమిండియాకు అది కీలకంగా మారింది. అంతే కాకుండా అటు బౌలింగ్‌లో భారత బౌలర్లు అదరగొట్టారు. బుమ్రా మొదట్లోనే శ్రీలంక బ్యాటర్లను ఫెవిలియన్‌ చేర్చగా.. అనంతరం సిరాజ్‌, కుల్దీప్‌ వారి పని వారు చేసుకుపోయారు. ముఖ్యంగా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 4 వికెట్లతో రాణించాడు. దీంతో భారత బౌలింగ్‌పై నెలకొన్న సందిగ్ధత తీరినట్లైంది.

మరోవైపు వెన్నునొప్పితో బాధపడుతున్న భారత బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కొలుకున్నట్లు తెలుస్తోంది. రేపు బంగ్లాదేశ్‌తో జరుగనున్న నామమాత్రపు మ్యాచ్‌ సందర్భంగా ఇవాళ జరిగిన ప్రాక్టిస్‌ సెషన్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ పాల్గొన్నాడు. దీంతో భారత బ్యాటింగ్‌ బలం మరింత పెరిగే అవకాశం ఉంది. వరల్డ్‌ కప్‌ ముందు భారత జట్టుకు అందరు కీలక బ్యాటర్లు, బౌలర్లు ఫిట్‌నెస్‌ సాధించడంతో భారత్‌ ఈ సారి కచ్చితంగా వరల్డ్‌ కప్‌ గెలుస్తుందని అభిమానులు ధీమాతొ ఉన్నారు.

Advertisment
తాజా కథనాలు