Team India to South Africa: వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. అయితే, ఫైనల్ లో అదృష్టం మొహం చాటేయడంతో ఓటమి పాలైంది. ప్రపంచకప్ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరుగుతున్నా దక్షిణాఫ్రికా పర్యటనతోనే జట్టుకు అసలైన పరీక్ష మొదలవుతుంది. డిసెంబర్ 10 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం కానుండగా, అందుకు గురువారం జట్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహం ఇంకా ఉంది. వైట్ బాల్ ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ ఇప్పటికే దూరమవడంతో రోహిత్ శర్మ ఇక్కడ అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు.
ఇక ఈ టూర్ విషయానికొస్తే టీమ్ఇండియా(Team India to South Africa) ఇక్కడ 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు ఆడాల్సి ఉంది. మొత్తం జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించే అవకాశం ఉంది. ప్రపంచకప్ తర్వాత సీనియర్ ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటుండగా, మిగిలిన జట్టు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడుతోంది. సౌతాఫ్రికా టూర్ చాలా కీలకం కావడంతో టీమ్ఇండియా తన పూర్తి బలాన్ని ఇక్కడికి పంపేందుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో టెస్టు సిరీస్ కు మాత్రమే అందుబాటులో ఉంటానని విరాట్ కోహ్లీ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో మరికొంత మంది ఆటగాళ్లకు అవకాశం దక్కే అవకాశం ఉంది.
రోహిత్ తప్పనిసరి..
వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ పూర్తిగా నిరాశలో పడిపోయినట్టు కనిపిస్తోంది. ఫైనల్ తర్వాత అతను ఎక్కడా కనిపించలేదు, అలాగే ఓటమి తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో అతను ఏడ్చిన సన్నివేశం అందరికీ గుర్తుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనతో కొత్త ఛాలెంజ్ మొదలైంది. ఇక్కడ కోహ్లీ లాంటి సీనియర్ ఆటగాడు లేడు కాబట్టి, ఈ పెద్ద పర్యటనలో(Team India to South Africa) బాధ్యత తీసుకోవడానికి ఒక సీనియర్ కచ్చితంగా ఉండాలని బోర్డు కోరుకుంటుంది. అంటే తప్పనిసరిగా రోహిత్ టీం లో ఉండాలి అని భావిస్తుంది.
Also Read: హమ్మయ్య క్లారిటీ వచ్చేసింది..టీమ్ ఇండియా కోచ్‌గా ద్రావిడ్ కొనసాగింపు
జూన్ లో జరిగే టీ20 ప్రపంచకప్ కు అందుబాటులో ఉండాలంటే.. ఇప్పటి నుంచే తన ఫామ్ సిద్ధం చేసుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ పరిస్థితుల్లో జూన్ లోపు జరిగే ఈ కీలక సిరీస్ తో పాటు ఐపీఎల్లో టీ20 వరల్డ్ కప్ కోసం సన్నద్ధమయ్యే అవకాశం రోహిత్ కు ఉంటుంది.
దక్షిణాఫ్రికాలో రోహిత్ రికార్డు ఇలా..
ఇక రోహిత్ విషయానికొస్తే గాయం కారణంగా గత సీజన్ లో దక్షిణాఫ్రికాకు(Team India to South Africa) వెళ్లలేకపోయాడు. అతని గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ వహించాడు. అప్పుడు టీమ్ఇండియా పరాజయం పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి విదేశీ గడ్డపై బ్యాట్స్ మన్ గా, కెప్టెన్ గా తన రికార్డును మెరుగుపరుచుకోవాలని రోహిత్ భావిస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో ఆతిథ్య జట్టుపై మూడు ఫార్మాట్లలో రోహిత్ శర్మ రికార్డు ప్రత్యేకంగా ఏమీ లేదు కాబట్టి రోహిత్ ఈ సారి కచ్చితంగా గెలుపు సాధించాలని కోరుకుంటాడనడంలో సందేహం లేదు.
దక్షిణాఫ్రికాలో రోహిత్ శర్మ..
- 6 టీ20లు, 135 పరుగులు
- 14 వన్డేలు, 256 పరుగులు, 1 సెంచరీ
- 4 టెస్టులు, 123 పరుగులు
ఇది టీమిండియా సౌతాఫ్రికా టూర్ లో పోటీల షెడ్యూల్.. .
- తొలి టీ20: డిసెంబర్ 10
- రెండో టీ20: డిసెంబర్ 12
- మూడో టీ20: డిసెంబర్ 14
- తొలి వన్డే: డిసెంబర్ 17
- రెండో వన్డే: డిసెంబర్ 19
- మూడో వన్డే: డిసెంబర్ 21
- తొలి టెస్టు: డిసెంబర్ 26-30
- రెండో టెస్టు: జనవరి 3-7
Watch this interesting Video: