Team India: విజయాల మెట్ల మీద నుంచి పరాజయం అగాధంలో పడిపోయిన ఒక కథ ముగిసింది. వరుస విజయాలతో తిరుగులేని స్థితి నుంచి ఒకే ఒక్క ఓటమితో.. తలలు వేలాడేసుకోవాల్సిన పరిస్థితి టీమిండియా అభిమానులది. ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఒక్క మ్యాచ్ తో నిరాశ.. ఒక్క ఓటమితో అసహనం.. ఒకే ఒక్క పరాజయం తీసుకువచ్చిన అవమాన భారం వీటిని మర్చిపోవడానికి మనకు చాలా కాలం పడుతుంది. ఇక ఇప్పుడు అందరూ పోస్ట్ మార్టం మొదలు పెట్టారు. ఓటమికి కారణాలు వెతుకుతూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కొందరు ఫీల్డింగ్ పేలవంగా ఉందని చెబుతున్నారు. మరికొందరు ఆల్ రౌండర్ పాండ్యా లేకపోవడం ఓటమికి కారణం అంటున్నారు. ఇంకొందరు టీమిండియా చేజేతులా ఓటమిని తెచ్చుకుంది అని అంటున్నారు. అయితే, మన టీమ్ గురించి నిర్మొహమాటంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఒత్తిడిని తట్టుకోలేక చేతులెత్తేయడం.. అవును.. ఒకసారి కాదు రెండుసార్లు కాదు 2014నుంచి జరిగిన ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ దశలోనే ఇంటిబాట పట్టింది టీమిండియా.
పూర్తిగా చదవండి..Team India: టీమిండియా ఎందుకు ఓడిపోయింది? సౌతాఫ్రికాతో తోడుగా మనమూ ఉన్నామా?
ప్రపంచకప్ ఫైనల్ లో ఓటమికి కారణాలు చాలా ఉండవచ్చు. కానీ నాకౌట్ లలో ఓడిపోవడంలో మనం సౌతాఫ్రికాకు ఏమాత్రం తీసిపోము. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రతి సంవత్సరం ప్రతి టోర్నీలోనూ నాకౌట్ దశలో టీమిండియా ఓడిపోతూనే ఉంది. ఇప్పటికైనా నాకౌట్ టెన్షన్ నుంచి బయటపడకపోతే అంతే సంగతులు.

Translate this News: