Teamindia: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్‌ ఎవరంటే..?

ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్ భారత్‌కు ప్రాక్టీస్‌గా కలిసిరానుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది.

New Update
Teamindia: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు రోహిత్ శర్మ దూరం.. కెప్టెన్‌ ఎవరంటే..?

Teamindia: ఆసియా కప్‌లో అదరగొట్టిన భారత్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు రెడీ అయింది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీకి కొన్ని రోజుల ముందు జరగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రాక్టీస్‌గా కలిసిరానుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ తాజాగా భారత జట్టును ప్రకటించింది. మొదటి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు.

వారి స్థానంలో జట్టులోకి రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ కూడా మొదటి రెండు వన్డేలకు ఎంపికయ్యాడు. మూడు వన్డేకు మాత్రం రోహిత్, కోహ్లీ, పాండ్యా జట్టులోకి రానున్నారు.  ఇక ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌ర్వాత రెండు జ‌ట్ల మ‌ధ్య న‌వంబ‌ర్ 23 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

మొద‌టి రెండు వ‌న్డేల‌కు భార‌త జ‌ట్టు..

కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, ర‌విచంద్రన్‌ అశ్విన్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

మూడో వ‌న్డేకు భార‌త జ‌ట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ర‌విచంద్ర‌న్‌ అశ్విన్, జ‌స్‌ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్

ఇది కూడా చదవండి: విరాట్ ను ఇమిటేట్ చేసిన ఇషాన్ కిషన్…ఆసియా కప్ ఫన్నీ మూమెంట్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు