Team India South Africa Tour: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా.. 

చరిత్ర సృష్టించడమే టార్గెట్ గా టీమిండియా వరల్డ్ కప్ తరువాత తొలి విదేశీ టూర్ కు బయలుదేరింది. సౌతాఫ్రికాతో డిసెంబర్ 10 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్.. ఆతరువాత టెస్ట్ సిరీస్.. వన్డే సిరీస్ లను గెలవడమే ధ్యేయంగా  మూడు వేర్వేరు జట్లు.. కెప్టెన్ లు తమ ప్రయాణం ప్రారంభించారు.   

Team India South Africa Tour: చరిత్ర సృష్టించడమే టార్గెట్.. దక్షిణాఫ్రికా టూర్ కు విమానమెక్కిన టీమిండియా.. 
New Update

Team India South Africa Tour: వరల్డ్ కప్ ఫైనల్స్ లో అనూహ్య ఓటమి తరువాత టీమిండియా.. ఆసీస్ తో టీ20 సిరీస్ గెలుచుకుని సూపర్ ఫామ్ లో ఉంది. ఇప్పటికే వన్డేల్లో.. టీ20ల్లో చాలా రికార్డులను తమ ఖాతాల్లో వేసుకున్న టీమిండియా క్రికెటర్లు ఇప్పుడు సౌతాఫ్రికాలో రికార్డులు సృష్టించాలని రెడీ అయిపోయారు. ఇప్పటివరకూ సౌతాఫ్రికాలో సాధ్యం కాకుండా ఉండిపోయిన రికార్డులను ఛేదించడమే టార్గెట్ గా.. 3 టీ20లు, 3 వన్డేలు - 2 టెస్టులు. అంటే మొత్తం 8 మ్యాచ్ లు ఆడటానికి విమానం ఎక్కేశారు భారత్ ఆటగాళ్లు. ప్రపంచ కప్ తరువాత తొలి విదేశీ పర్యటన కావడంతో ఇటు అభిమానులు.. అటు టీమ్ మేనేజిమెంట్ కూడా ఈ టూర్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ టూర్ లో చాలామంది యువ - కొత్త ఆటగాళ్లు మొదటిసారి సౌతాఫ్రికాలో ఆడటానికి వెళుతున్నారు. వారిలో చాలామందికి ఇదే తొలి విదేశీ టూర్(Team India South Africa Tour) కూడా. అందుకే వారాంతా టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోవడం కోసం ఈ టూర్ ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో అందరూ కొత్త ఉత్సాహంతో తమని తాము నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. 

దక్షిణాఫ్రికా పర్యటనకు భారత టీ20, వన్డే, టెస్టు జట్లను ఒకేసారి ప్రకటించారు. ఈ పర్యటనలో జరిగే మూడు ఫార్మాట్ల సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్లు కూడా వేరువేరుగా ఉన్నారు.  టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటారు. ఈ మూడు జట్లు కలిసి ఒకేసారి  దక్షిణాఫ్రికాకు(Team India South Africa Tour) విమానం ఎక్కాయి. 

Also Read: పాండ్యా కోసం బీసీసీఐ స్పెషల్ ప్లాన్!.. వరల్డ్ కప్ లోగా టీంలోకి తిరిగొస్తాడా?

భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఈ ఫోటోలను కొన్ని ప్లేయర్‌లు తమ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్స్ నుంచి  షేర్ చేశారు. విమానం లోపల నుంచి ఒక ఇమేజి షేర్ చేశారు.  అందులో రింకూ సింగ్ సీటుపై కూర్చున్నాడు - అతని వెనుక కుల్దీప్, అర్ష్‌దీప్ వంటి కొంతమంది ఆటగాళ్ళు నిలబడి ఉన్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఆటగాళ్లందరూ భారత T20 జట్టులో భాగమే.

డిసెంబర్ 10 నుంచి భారత్ దక్షిణాఫ్రికా పర్యటన(Team India South Africa Tour) ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భారత్ తన మొత్తం 8 మ్యాచ్‌లను 10 డిసెంబర్ 2023 నుంచి  7 జనవరి 2024 వరకు ఆడాలి. ఈ టూర్ టీ20 సిరీస్‌తో ప్రారంభం అవుతుంది. టెస్టు సిరీస్‌తో ముగుస్తుంది.

డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా భారత జట్టుకు చరిత్ర సృష్టించే సువర్ణావకాశం లభించనుంది. ఎందుకంటే, దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ టెస్ట్ సిరీస్ భారత్ గెలవలేదు.  అయితే, టీమ్ ఇండియా తన సొంత ఊపును నెలకొల్పాలంటే, టూర్(Team India South Africa Tour) ప్రారంభమైన మొదటి 96 గంటల నుంచే విజయాలను నమోదు చేయాలి. 96 గంటలు అంటే  3 టీ20ల సిరీస్‌ జరిగే రోజులు.  అంటే డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14వ తేదీలోపు టీమిండియా విజయాలతో ప్రారంభిస్తే.. తరువాత అవి.. రికార్డులు సృష్టించడానికి మార్గాలుగా నిలుస్తాయి. 

Watch this interesting Video:

#team-india #india-vs-south-africa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe