Team India Record: అచ్చం అలానే.. రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. ఈసారి కప్ మనదే!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన సూపర్-8 మ్యాచ్ లో 13 సిక్సర్లు బాదేశారు మన బ్యాటర్లు. 2007లో ఒకే మ్యాచ్ లో 11 సిక్సర్లు బాదిన రికార్డ్ బద్దలు కొట్టేశారు. అప్పుడు టీమిండియా చాంపియన్ అయింది. ఇప్పుడు కూడా ట్రోఫీ మనదే అంటున్నారు అభిమానులు 

Team India Record: అచ్చం అలానే.. రికార్డ్ బద్దలు కొట్టిన టీమిండియా.. ఈసారి కప్ మనదే!
New Update

Team India Record:  టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉన్న టీమ్స్ లో  టీమిండియా ఒకటి. ఈసారి విశేషం ఏమిటంటే, టోర్నీలో జరిగిన అనేక యాదృచ్ఛిక సంఘటనలు కూడా టీమిండియా ఛాంపియన్‌గా నిలిచే దిశగానే ఉన్నాయి. ఇదే కాకతాళీయంగా జరిగి ఉండవచ్చు. కానీ 2007లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అలానే ఇప్పటి పరిస్థితులు కూడా ఉండడం విశేషం.  ఒకే మ్యాచ్‌లో టీమిండియా అత్యధిక సిక్సర్లు కొట్టింది. భారత బ్యాట్స్‌మెన్‌ల బ్యాట్‌లతో కురిసిన ఈ సిక్సర్ల వర్షంతో  17 ఏళ్ల రికార్డు బద్దలైంది. అంటే టీ20 ప్రపంచకప్‌లో ఎన్నడూ జరగని పనిని భారత ఆటగాళ్లు చేశారు. ఇలా చేయడం ద్వారా 2024లో టీ20 ప్రపంచకప్‌ను కచ్చితంగా గెలుస్తుంది అనే ఆశ ప్రతి భారతీయుడిలోనూ పెరిగిపోయింది. 

Team India Record:  ఈ సిక్సర్ల వర్షం టీమ్ ఇండియా ఎప్పుడు కొట్టింది? బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది టీమిండియా . టీ20 క్రికెట్‌లో టీమిండియా అత్యధిక సిక్సర్లు బాదిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అంటే, టీమిండియా ఒక మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. ఇలా చేయడం ద్వారా 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

17 ఏళ్ల రికార్డు బద్దలైంది..  భారత్ ఛాంపియన్ కావడం పక్కా..

Team India Record:  2007 టీ20 ప్రపంచకప్‌లో డర్బన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 11 సిక్సర్లు కొట్టింది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా  కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. అయితే 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 సిక్సర్లు కొట్టింది టీమిండియా. 2007లో ఒక మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమ్ ఇండియా రికార్డు సృష్టించినప్పుడు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదే అతి పెద్ద విషయం ఇప్పుడు ఈసారి ఆ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా ఆ విశేషాన్ని మళ్ళీ తిరిగి చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

టీమిండియా 13 సిక్సర్లు ఇలా..

Team India Record:  బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 13 సిక్సర్లు ఎలా కొట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం.  మొత్తం 6 మంది టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు ఇందులో పాత్ర పోషించారు. ఎందుకంటే అందరూ కలిసి ఈ 13 సిక్సర్లు కొట్టారు. విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే అత్యధికంగా మూడేసి  సిక్సర్లు కొట్టారు. రిషబ్ పంత్ 2 సిక్సర్లు బాదగా, రోహిత్, సూర్యకుమార్ ఒక్కో సిక్స్ కొట్టారు.

#t20-world-cup-2024 #cricket #team-india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe