Team India In WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టాప్ ప్లేస్ లో టీమిండియా టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో టాప్ ప్లేస్ లోకి చేరింది. ఈ సైకిల్ లో మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. దీంతో టీమిండియా 3 సిరీస్‌లలో 68.51% పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. By KVD Varma 10 Mar 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి Team India In WTC: ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చివరిదైన ధర్మశాల టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ధర్మశాలలో HPCA స్టేడియంలో గురువారం మార్చి 7న జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు 218 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 477 పరుగులకు ఆలౌటైంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 259 పరుగుల ఆధిక్యం సాధించగా, ఇంగ్లండ్ జట్టు 195 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లిష్ జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. WTC 9 మ్యాచ్‌లలో భారత్ 6 గెలిచింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (Team India In WTC)సైకిల్లో టీం ఇండియా ఇప్పుడు 3 సిరీస్‌లలో 2 గెలిచింది. ఇప్పటి వరకు మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 6 గెలిచి 2 మాత్రమే ఓడిపోయింది. ఇందులో వెస్టిండీస్‌తో డ్రా అయినా మ్యాచ్ కూడా ఉంది. అంటే ఒకే ఒక్క మ్యాచ్ భారత్ ఓడిపోయింది. భారత్ 4-1తో ఇంగ్లండ్‌ను ఓడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికాలో జరిగిన 2 టెస్టుల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకోగా, 2 టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0తో ఓడిపోయింది. టీమిండియా (Team India In WTC) 3 సిరీస్‌లలో 68.51% పాయింట్లు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో సొంతగడ్డపై 2వ సిరీస్ జరగనుంది. Also Read: రిటైర్మెంట్ ఎప్పుడో చెప్పేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..! సొంతగడ్డపై 17వ సిరీస్ విజయం.. గత 12 ఏళ్లలో సొంతగడ్డపై భారత్‌కు(Team India In WTC) ఇది వరుసగా 17వ సిరీస్ విజయం. స్వదేశంలో వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా భారత జట్టు ఇప్పటికే రికార్డు సృష్టించింది. స్వదేశంలో వరుసగా 10 సిరీస్‌లు గెలిచిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. చివరిసారిగా 2012లో స్వదేశంలో టెస్టు సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 2-1తో భారత్‌ను ఓడించింది. అప్పటి నుండి, టీమ్ ఇండియా(Team India In WTC) స్వదేశంలో ఏ సిరీస్‌ను కోల్పోలేదు అలాగే, ప్రత్యర్థి జట్టును వరుసగా 17 సార్లు ఓడించింది. టెస్టుల్లో అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత ఆటగాడు.. రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బెన్ ఫాక్స్‌ను అవుట్ చేయడం ద్వారా టెస్ట్ క్రికెట్లో 36వ సారి ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. దీంతో అనిల్ కుంబ్లేను వెనక్కి నెట్టాడు అశ్విన్. టెస్టు క్రికెట్లో కుంబ్లే 35 ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా అశ్విన్ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ధర్మశాల టెస్టు అశ్విన్‌కి 100వ టెస్టు, ఇందులో అతను మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. #wtc #team-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి