/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/hanuma-vihari-jpg.webp)
Hanuma Vihari Shocking Decision: ఆంధ్ర క్రికెట్‌కు ఆడిన టాలెంటెడ్ క్రికెటర్లలో హనుమ విహారీ (Hanuma Vihari) ఒకడు. గతేడాది మణికట్టు గాయంతోనూ బ్యాటింగ్‌కు దిగి సింగిల్ హ్యాండ్‌తో టీమ్‌ను గట్టెక్కించేందుకు విహారి చూపిన తెగువ అనన్య సామాన్యం. ఆంధ్ర జట్టు కెప్టెన్‌గా (Andhra Team Captain) విహారీ సేవలు మరువలేనివి. జట్టు విజయాలు, అపజయాలు సంగతి పక్కన పెడితే టీమ్‌లో యూనిటీని తీసుకొచ్చింది విహారీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి విహారిని ఈ(2023-24)రంజీ సీజన్ మధ్యలో కెప్టెన్‌గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తప్పించింది. బెంగాల్‌పై మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించింది. ఇదంతా ఎందుకు జరిగిందో ఎప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది. దీనికి కారణం ఓ రాజకీయ నేతగా తెలుస్తోంది.
The whole team knows! ❤️ pic.twitter.com/l5dFkmjGN9
— Hanuma vihari (@Hanumavihari) February 26, 2024
ఎవరా రాజకీయ నేత?
ఆంధ్ర జట్టులోని ఓ ఆటగాడిపై విహారీ నోరుపారేసుకున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అతను టీమ్‌లో 17వ ఆటగాడిగా సమాచారం. ఓ రాజకీయనేత కొడుకైన ఆ ఆటగాడు ఈ విషయం గురించి తన తండ్రికి కంప్లైంట్ చేశాడు. దీంతో ఏసీఏపై ఒత్తిడి పెరిగి విహారీని కెప్టెన్సీ నుంచి తప్పించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని విహారీ తాజాగా చెప్పుకొచ్చాడు. తనకు విలువలేని చోట ఉండేది లేదని.. తనకు ఆంధ్ర క్రికెట్ అంటే ఇష్టమని.. అయితే అసోసియేషన్ తీరు కారణంగా ఇకపై ఆంధ్రకు ఆడడని విహారీ చెప్పడం సంచలనంగా మారింది. ఇంతకి ఆ రాజకీయ నేత ఎవరన్నదానిపై క్రికెట్ సర్కిల్స్‌తో పాటు అటు పొలిటికల్ సర్కిల్‌లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
విహారీ తప్పు లేదు:
మరోవైపు విహారీ ట్విట్టర్‌లో చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. విహారీని తప్పించవద్దని.. అతని తప్పేమీ లేదని జట్టు మొత్తం సైన్ చేసిన ఓ లెటర్ సంచలనం రేపింది. విహారీ దురుసుగా ప్రవర్తించలేదని తొటి ప్లేయర్లు చెబుతున్నారు. విహారీ ఆ సంబంధిత ఆటగాడిపై చేసిన వ్యాఖ్యలు సాధారణమేనని.. అతనే పర్శనల్‌గా తీసుకున్నాడని జట్టు మొత్తం చెబుతోంది. అయినా కూడా విహారీని తప్పించడం అన్యాయమని తమ యూనిటీని చూపించింది ఆంధ్ర జట్టు. మరి చూడాలి జరుతున్న పరిణామాలపై ఏసీఏ ఎలా స్పందిస్తుందో!
Also Read: నాలుగో టెస్ట్‌లో భారత్ ఘనవిజయం..సీరీస్ కూడా మనదే
WATCH THIS TRENDING CRICKET VIDEO: NZ vs AUS 3rd T20I - Cricket Highlights