Team India: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా!

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ20లో 150 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది. ఇప్పటివరకూ భారత జట్టు 230 టీ20 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 150 మ్యాచ్‌లు గెలిచింది.

Team India: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా!
New Update

Team India: జింబాబ్వేతో బుధవారం జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వే జట్టు 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టీమిండియా తరఫున యస్సవ్ జైస్వాల్ 36 పరుగులు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 66 పరుగులు, అభిషేక్ శర్మ 10 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 49 పరుగులు, సంజూ శాంసన్ 12 పరుగులు చేశారు. బౌలింగ్‌లో మ్యాజిక్ చేసిన వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ విజయంతో టీమ్ ఇండియా అంతర్జాతీయ టీ20లోనూ చరిత్ర సృష్టించింది.

Team India: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ20లో 150 మ్యాచ్‌లు గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. భారత జట్టు 230 టీ20 మ్యాచ్‌లు ఆడగా 150 మ్యాచ్‌లు గెలిచింది. ఈ విషయంలో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉం.  ఈ జట్టు ఆడిన 245 మ్యాచ్‌లలో 142 మ్యాచ్‌లు గెలిచింది. మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 220 మ్యాచ్‌లు ఆడగా 111 మ్యాచ్‌లు గెలిచింది. ఆస్ట్రేలియా 195 మ్యాచ్‌లు ఆడగా 105 మ్యాచ్‌లు గెలిచి నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 192 మ్యాచ్‌ల్లో 100 విజయాలతో ఐదో స్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 185 మ్యాచ్‌లు ఆడి 104 విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

Team India: ఈ క్రమంలో టీమ్ ఇండియా గెలుపు శాతం 65.21గా ఉంది. కానీ గెలుపు శాతం పరంగా ఉగాండా జట్టు గణాంకాలు అత్యద్భుతంగా ఉన్నాయి. ఉగాండా ఆడిన 95 మ్యాచ్‌ల్లో 70 విజయాలు సాధించింది. ఉగాండా విజయ శాతం 73.68గా ఉంది. అంతేకాకుండా  అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత జట్టు ఉమ్మడిగా మూడవ స్థానంలో ఉంది. భారత జట్టు వరుసగా 12 మ్యాచ్‌లు గెలిచి రికార్డు సృష్టించింది.

#team-india #t20-cricket
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe