పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్లను సరైన దారిలో నడిపించాల్సిన ఓ టీచర్ దారుణానికి పాల్పడింది. తమ స్కూల్ లో చదువుతున్న 14ఏళ్ల బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. పలుసార్లు మద్యం, గంజాయి తాగించి కామవాంఛ తీర్చుకుంది. ఈ సంఘటన అమెరికాలోని మాంట్‌గోమెరి కౌంటీలో చోటుచేసుకోగా ఈ దారుణం తెలిసిన పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Also Read : పొద్దున్నే మొలకలు తింటున్నారా.. అయితే ఈ 8 విషయాలు తెలుసుకోండి
ఈ మేరకు మాంట్‌గోమెరి కౌంటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాంట్‌గోమెరి విలేజ్ మిడిల్ స్కూల్‌లో విద్యార్థిగా ఉన్న సమయంలో తనతో టీచర్ శృంగారంలో పాల్గొందని 14 ఏళ్ల విద్యార్థి ఆరోపణలు చేశాడు. అతను 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్నపుడు.. టీచర్ గా పనిచేస్తున్న మెలిసా మేరి కర్టిస్ అనే యువతి తనతో శృంగారంలో పాల్గొన్నట్లు తెలిపాడు. అంతేకాదు పలుమార్లు మద్యం తాగించి, గంజాయి ఇచ్చిన టీచర్ తనతో బలవంతంగానే సెక్స్ కోరికలు తీర్చుకుందని చెప్పాడు. అప్పుడు ఆమెకు 22 ఏళ్ల వయసు ఉంటుందని పలు విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె చేసిన పనికి షాక్ అయిన పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకున్నారు. సదరు బాలుడితో శృంగారంలో పాల్గొన్నట్లు తమ విచారణలో తేలిందని, అక్టోబర్ 31న ఆమెకు అరెస్టు వారెంట్ జారీ చేశారు. పలు కేసులు నమోదు చేసి ఇంకెవరైనా ఆమె బాధితులున్నారేమో తెలుసుకునేందుకు మరింత లోతుగా కేసును పరిశీలిస్తున్నట్లు మీడియాతో తెలిపారు.