AP: పోలీసుల తీరుపై వర్మ సీరియస్.. వారిపై కేసు నమోదు చేయాలని లేదంటే..! పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. By Jyoshna Sappogula 19 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి TDP Varma: పోలీసుల తీరుపై పిఠాపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 40 రోజులు క్రితం యు.కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసినా పోలీసులు ఇంత వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దాడిలో గాయాలపాలైన బాధితులు వర్మని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో కాకినాడ డిఎస్పి హనుమంతరావుపై యు.కొత్తపల్లి ఎస్సై పై వర్మ సీరియస్ అయ్యారు. టీడీపీ కార్యకర్తల తలలు బద్దల కొడితే అధికారులు ఎటువంటి సెక్షన్ లు నమోదు చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. Also Read: పిఠాపురంలో భారీ వర్షాలు.. కరెంట్ వైర్ రోడ్డుపై తెగిపడటంతో.. ఒక జిల్లా ఎస్పీ ఫిర్యాదు చేసి చెప్పినా సరే కాకినాడ డీఎస్పీ పట్టించుకోలేదని వైసీపీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారని వర్మ మండిపడ్డారు. కార్యకర్తలపై మర్డర్ అటెంప్ట్ జరిగితే చిన్నచిన్న కేసులు పెట్టి వాళ్లని వదిలేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారని వర్మ ఆరోపించారు. గతంలో ఇదే డిఎస్పి ఎన్నికల సమయంలో తాడిపత్రిలో సాయిధర్మతేజ్ పై దాడి జరిగినప్పుడు పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. ఈ డీఎస్పీ వైసీపీకి మద్దతుదారుడని.. ఎన్నికల సమయంలో మద్యం దొరికితే పెద్ద వ్యక్తులను వదిలి చిన్న వ్యక్తులపై కేసు నమోదు చేయించిన చరిత్ర అని వర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జిల్లా ఎస్పి, డిఎస్పి స్పందించాలని, మర్డర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని ఎడల గ్రామంలో ప్రజలందరితో ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా నిర్వహిస్తామని వర్మ తేల్చిచెప్పారు. #ap-news #pithapuram #latest-news-in-telugu #pithapuram-varma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి