Anitha : "ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని సీఎంకు సమస్యలు ఎలా తెలుస్తాయి"?

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అంగన్వాడీల ఆందోళన 5వ రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి మద్దతూ తెలిపి దీక్షలో పాల్గొన్నారు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత. ఉల్లి గడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని జగన్ కు అంగన్వాడీల కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anitha : వైసీపీ పాలనలో పోలీస్ స్టేషన్ల పరిస్థితి దారుణం: హోంమంత్రి అనిత
New Update

Vangalapudi Anitha: ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన (Anganwadi Workers Strike) 5వ రోజు కొనసాగింది. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కంటే అదనంగా జీతం ఇస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోనూ అంగన్వాడీల ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతూ తెలిపి దీక్షలో పాల్గొన్నారు టీడీపీ మహిళ నాయకురాలు వంగలపూడి అనిత. ఈ సందర్భంగా సీఎం జగన్ (CM Jagan) పై హాట్ కామెంట్స్ చేశారు. ఉల్లి గడ్డకు, ఆలు గడ్డకు తేడా తెలియని జగన్ కు అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ఎలా తెలుస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతగాని సీఎం జగన్ అని విమర్శలు గుప్పించారు.

Also Read: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి..

అంగన్వాడీ టీచర్స్, ఆయాలు పిల్లలకు చేస్తున్న సేవ ఆమోగం అని.. వారు చేస్తున్న డిమాండ్స్ న్యాయబద్ధమైనవేనని సంఘీభావం తెలిపారు. పార్టీ నాయకులతో జగన్ సంప్రదింపుల్లో వేతనం తప్ప ఏదయినా అడగండి అని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. అంగన్వాడీ సిబ్బందికి వచ్చిన జీతంలోనే పిల్లలకు ఖర్చు పెట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: దేశంలోకి కరోనా కొత్త సబ్ వేరియంట్.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

సీఎం జగన్ పై అంగన్వాడీ సిబ్బంది నిప్పులు చెరిగారు. 5 రోజుల నుండి దీక్ష చేస్తున్న జగన్ ప్రభుత్వం (YCP Government) నిద్ర పోతుందా? మా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని అని ధ్వజమెత్తారు. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు మాకు రావాల్సిన రిటైర్మెంట్ పెన్షన్, గ్రాట్యుటీ వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. తమకు ఏ సంక్షేమ పథకాలు రాకుండా చేశారని విమర్శలు గుప్పించారు. తమకు హామీ ఇచ్చిన 11 డిమాండ్లను నెరవేర్చే వరకూ పోరాటం ఆపేదేలేదని తేల్చి చెప్పారు.

#andhra-pradesh #vangalapudi-anitha #tdp-anitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe