టీడీపీని జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌కు ఇవ్వాలి: లక్ష్మీపార్వతి మీకు పార్టీని నడిపించేంత సీన్ లేదు కానీ.. జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు టీడీపీ పగ్గాలు ఇవ్వాలని లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా.. అక్రమంగా సంపాదనలు ఎక్కువగా ఉన్నాయి తప్ప.. అభివృద్దిలో మాత్రం శూన్యం ఉందన్నారు. ఇప్పటికైనా నందమూరి ఫ్యామిలీకి టీడీపీని అప్పగిస్తే కనీసం పార్టీకైనా బాగుటుందన్నారు. కష్టాలు పడిన వారికే ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. By Vijaya Nimma 27 Jun 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ప్రజలు ఇచ్చిన రథం టీడీపీ అధినేత చంద్రబాబు, కుమారుడు నారా లోకేష్‌పై మరోసారి మండిపడ్డారు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి. నెల్లూరులో మాట్లాడిన ఆమె.. చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యం.. ఎన్నో కష్టాలు పడిన జగన్‌కు రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని తెలిపారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని విమర్శించిన ఆమె.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మరు.. ఎన్టీఆర్ మనవడుగా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేద.. వాళ్లిద్దరికీ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఇక, టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని డిమాండ్ చేసిన లక్ష్మీపార్వతి.. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని సూచించారు. టీడీపీకి జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామే కరెక్ట్ చంద్రబాబు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు. తహశీల్దార్ వనజాక్షిని బెదిరించారని విరుచుకుపడ్డారు. ఇక, లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారు.. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని.. అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పనికి మాలిన లోకేష్ కోసం కోట్లు ఖర్చు పెట్టి భాష నేర్పించాడు.. అయినా అతనిలో మార్పు రాలేదని ఎద్దేవా చేశారు. విషవృక్షం నీడలోకి సినిమా వాళ్లు ఇప్పటికైనా టీడీపీని నందమూరి ఫ్యామిలీలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సూచించారు. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయ్యిందని వ్యాఖ్యానించిన ఆమె.. సినిమాలు చేసుకుంటున్న పవన్‌ను తీసుకొచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నాడని ఆరోపించారు. విష వృక్షం నీడలో రాజకీయాలు చెయ్యొద్దని గతంలో పవన్ కల్యాణ్‌కి చెప్పాననిలక్ష్మీపార్వతి గుర్తుచేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి