TDP: సీనియర్లకు ఊహించని షాకిచ్చిన చంద్రబాబు.. వారికి ఇక టికెట్ లేనట్లేనా?

బొండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు తదితర సీనియర్లందరికీ షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఈ రోజు విడుదలైన టీడీపీ థర్డ్ లిస్ట్ లోనూ వీరికి చోటు దక్కకపోవడం ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారింది.

TDP: సీనియర్లకు ఊహించని షాకిచ్చిన చంద్రబాబు.. వారికి ఇక టికెట్ లేనట్లేనా?
New Update

అభ్యర్థుల ప్రకటనలో సీనియర్లకు టీడీపీ (TDP) హైకమాండ్ షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి, కీలక నేత దేవినేని ఉమను (Devineni Uma) పక్కనపెట్టింది. థర్డ్ లిస్ట్ లో మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించారు.‌ దీంతో దేవినేని ఉమకు సీటు లేనట్లేనని తేలిపోయింది. పెనమలూరులో బోడె ప్రసాద్ కు కేటాయించారు చంద్రబాబు (Chandrababu). మరో కీలక నేత గంటా శ్రీనివాసరావుకు కూడా షాక్ ఇచ్చింది టీడీపీ నాయకత్వం. ఈ రోజు విడుదలైన 3వ జాబితాలోనూ ఆయన పేరు కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పెందుర్తిలోనూ బండారు సత్యనారాయణమూర్తికి షాక్ ఇచ్చారు. ఆయన పేరు కూడా లిస్ట్ లో లేదు.
ఇది కూడా చదవండి: YS Sharmila: కడప నుంచి పోటీకి సిద్ధం.. షర్మిల సంచలన ప్రకటన

ఇంకా.. మాజీ మంత్రి, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు కూడా సీటు కేటాయించలేదు చంద్రబాబు. పెండింగ్‌లోనే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల, పాలకొండ సీట్లను ఉంచడం అక్కడి నేతలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి, విశాఖపట్నం పెందుర్తి, భీమిలి సీట్లను కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంచారు చంద్రబాబు. ప్రకాశం జిల్లాలో దర్శి, కడప జిల్లాలో రాజంపేట, బద్వేల్ టికెట్లు కూడా పెండింగ్ లో ఉంచారు.‌

ఈ రోజు టీడీపీ థర్డ్ లిస్ట్ ను విడుదల చేసింది. 11ఎమ్మెల్యే, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఎమ్మెల్యే అభ్యర్థులు
-- కాకినాడ సిటీ- వనమాడి వెంకటేశ్వరరావు
-- అమలాపురం- అయితా బత్తుల ఆనందరావు
-- శ్రీకాకుళం - గొండు శంకర్
-- శృంగరపుకోట- కోళ్ల లలితా కుమారి
-- పలాస- గౌతు శిరీష
-- పాతపట్నం- మామిడి గోవింద్‌ రావు
-- మైలవరం- వసంత వెంకట కృష్ణ ప్రసాద్
-- పెనమలూరు- బోడె ప్రసాద్
-- చీరాల - మాల కొండయ్య
-- నరసరావుపేట- చదలవాడ అరవింద్ బాబు
-- సర్వేపల్లి- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎంపీ అభ్యర్థులు:
శ్రీకాకుళం- రామ్మోహన్ నాయుడు
విశాఖపట్నం- మాత్కుపల్లి భరత్
అమలాపురం గంటి హరీష్ మాధుర్
ఏలూరు- పుట్టా మహేష్ యాదవ్
గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్
విజయవాడ- కేశినేని చిన్ని
నరసరావుపేట- లావు శ్రీకృష్ణ దేవరాయలు
బాపట్ల - టి. కృష్ణప్రసాద్
చిత్తూరు- దగ్గుమళ్ల ప్రసాద్‌ రావు
కర్నూలు- బస్తిపాటి నాగరాజు
నంద్యాల- బైరెడ్డి శబరి
హిందూపూర్- బీకే. పార్థసారధి
నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

#jana-sena-tdp #chandrababu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి