/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/TDP-7-jpg.webp)
TDP Parliamentary: ఇవాళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2:30 కు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కానుంది. భేటీకి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు తీసుకురావడంపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే శాఖల వారీగా మంత్రులను ఎంపీలకు అటాచ్ చేసింది ప్రభుత్వం. ఆయా శాఖల వారీగా కేంద్రం నుంచి తీసుకురావలసిన నిధులపై ఎంపీలతో మంత్రులు సమన్వయం చేసుకోనున్నారు. అలాగే పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.