Nara lokesh: కాసేపట్లో ఢిల్లీకి లోకేష్..హైదరాబాద్ ఆసుపత్రికి బాబు! కాసేపట్లో నారా లోకేష్ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. చంద్రబాబు మీద ఉన్న కేసుల గురించి ఆయన న్యాయనిపుణులతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కూడా ఈరోజు విజయవాడ నుంచి హైదరాబాద్ కి వైద్య పరీక్షల నిమిత్తం రానున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన హైదరాబాద్ వస్తున్నారు. By Bhavana 01 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ New Update షేర్ చేయండి మరికాసేపట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Naralokesh) ఢిల్లీకి(Delhi) బయల్దేరి వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు (CBN) స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కు సంబంధించి న్యాయ నిపుణులతో మాట్లాడనున్నారు. సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటీషన్ పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు (CBN)పై వరుసగా కేసులు నమోదు అవుతుండడంతో పార్టీ క్యాడర్ ను కంగారు పెట్టిస్తున్నాయి. వరుసగా నమోదు అవుతున్న కేసుల విషయంలో ఏమేం ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద లోకేష్ న్యాయనిపుణులతో చర్చించనున్నారని పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. Also read: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం! ఇదిలా ఉండగా మరికాసేపట్లో చంద్రబాబు కూడా వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కి బయల్దేరనున్నారు. ఆయన విజయవాడ నుంచి నేరుగా హైదరాబాద్ కి రానున్నారు. జైలులో ఉండటం వల్ల ఆయనకు ఆరోగ్యం బాలేదని తెలుస్తుంది. దాంతో ఆయన వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు బయలుదేరుతున్నారు. దీని గురించి టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వివరించారు. బాబు షెడ్యూల్ కి సంబంధించిన వివరాలను అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘కోర్టు ఆదేశాలతో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరినీ ఆయన కలవరు.’ అని ప్రకటనలో స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. Also read: ఉద్వేగం..ఉద్విగ్నం.. ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. ! వీడియో! నేడు మన నాయకునికి బెయిల్ రావటం మనతోపాటు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు వివిద దేశాల్లోని తెలుగు పౌరులకు సంతోషకరం. ఇదే స్పూర్తి ముందు కూడా కొనసాగిద్దామని ఆయన పేర్కొన్నారు. #chandrababu-naidu #lokesh #tdp #bail మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి