TDP: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌బై!

రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌ బై చెప్పారు. ఈ సారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్‌ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం. ఈ నెల 28న లోకేష్ తో ఆయన భేటీ కానున్నారు.

New Update
TDP: టీడీపీకి ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌బై!

MP Galla Jayadev: ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ కు గద్దె దించాలని వ్యూహాలు రచిస్తున్న టీడీపీ కి షాక్ తగిలింది. రాజకీయాలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ గుడ్‌ బై చెప్పారు. ఈసారి ఎన్నికలకు దూరంగా గల్లా జయదేవ్‌ ఉండనున్నారు. ఇప్పటికే అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపినట్లు సమాచారం.

లోకేష్‌తో భేటీ..

రెండుసార్లు తనని గెలిపించిన వారికి ధన్యవాదాలు తెలిపేందుకు సమావేశం నిర్వహించనున్నారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌. ఈ నెల 28న లోకేష్‌ తో పాటు టీడీపీ నేతలతో జయదేవ్‌ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఓ ప్రవేట్ కళ్యాణ మంటపంలో ఆత్మీయ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జయదేవ్ కుటుంబ సభ్యులు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభ కోసం తెలుగు తమ్ముళ్లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: చంద్రబాబు అరెస్ట్.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

వ్యక్తి గత కారణాలే..?

గల్లా జయదేవ్  2014, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఎంపీగా రెండు సార్లు గెలిచారు.  ఆంధ్ర ప్రదేశ్‌లోని సమస్యలపై పార్లమెంట్‌లో తన గొంతు విప్పారు. ఇదే విషయంలో ఒకనొక  సమయంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజగా రాజకీయాలకు దూరంగా ఉండాలని గల్లా జయదేవ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన కేడర్ అసంతృప్తిగా ఉంది.

రాజకీయాల్లో ఉండడం వల్ల తన బిజినెస్ పై దృష్టి సారించలేకపోతున్నారని.. అటు రాజకీయాలకు.. ఇటు తన సొంత వ్యాపారాలకు న్యాయం చేయడం లేదని గల్లా జయదేవ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం సీఎం జగన్ ఆయన వ్యాపారాలను టార్గెట్ చేసి నష్టాలు వచ్చేలా చేశారని మరో వర్గం గుసగుసలు పెడుతుంది. ఏది ఏమైనా రాజకీయాలు చెక్ పెట్టాలని గల్లా జయదేవ్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారో ఆయన సమాధానం చెప్పాలి.

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు