/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/TDP-MLA.jpg)
TDP MLA Koneti Adimulam: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీలల బాగోతం బయటపడింది. ఒక మహిళా నాయకురాలితో ప్రైవేటు హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల రాసలీలల బాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలల బాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే, టీడీపీ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అగష్టులో జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే చినబాబు గారికి, సీఎం సార్ కు చెప్పాను
అప్పటి నుండి ఎమ్మెల్యే నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడు
దయచేసి నన్ను కాపాడండి చంద్రబాబు సారు అంటూ వాపోయిన బాధిత మహిళhttps://t.co/F8zETxpvoF pic.twitter.com/YyjXWaxD9o
— greatandhra (@greatandhranews) September 5, 2024
కోరిక తీర్చాలంటూ...
తన కోరికలు తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నాడని బాధిత మహిళా పేర్కొంది. టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళా సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేసినట్లు పేర్కొంది. రాత్రి పూట మెసేజ్‌లు చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తెలిపింది. ఎమ్మెల్యే చేసే ఇలాంటి పనులకు తిరుపతి భీమా ప్యారడైజ్ హోటలే అడ్డా అని ఆమె తెలిపింది. ఇలాంటి వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును బాధిత మహిళా నాయకురాలు డిమాండ్ చేసింది.