Koneti Adimulam: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
AP: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు వరలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఇప్పటికే ఆయనను పార్టీ నుండి టీడీపీ సస్పెండ్ చేసింది.