Kolikapudi Srinivasa Rao : 'ఇంద్ర' రీ రిలీజ్.. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్

మెగాస్టార్ బర్త్ డే కానుకగా 'ఇంద్ర'మూవీ థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు థియేటర్లో సినిమా చూస్తూ కాగితాలు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

New Update
Kolikapudi Srinivasa Rao : 'ఇంద్ర' రీ రిలీజ్.. థియేటర్ లో రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యే, వీడియో వైరల్

TDP MLA Kolikapudi Srinivasa Rao : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో మెయిల్ స్టోన్ మూవీ అయిన 'ఇంద్ర' ఆగస్టు 22 చిరు బర్త్ డే కానుకగా థియేటర్స్ లో రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్స్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా 'ఇంద్ర' థియేటర్స్ లో రీ రిలీజ్ అవ్వడంతో సీనియర్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి వచ్చారు.

మెగాస్టార్ ని తెరపై చూడగానే వాళ్ళల్లో ఊపు వచ్చింది. ఆ ఊపుతో థియేటర్స్ లో ఇంద్ర పాటలకు డ్యాన్సులు వేస్తూ రచ్చ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ వీరాభిమాని అయిన ఓ ఎమ్మెల్యే ఇంద్ర మూవీని థియేటర్స్ లో చూస్తూ తెగ ఎంజాయ్ చేశారు. అతను మరెవరో కాదు ఎన్టీఆర్ జిల్లాకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

ఈయన తన అభిమాన హీరో మెగాస్టార్ తెరపై కనిపించగానే థియేటర్లో కాగితాలు విసురుతూ రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్..' ప్రస్తుతం ఎమ్మెల్యేనే అయి నా.. ఆయనా ఓ వీరాభిమానే కదా!', మెగాస్టార్ క్రేజ్ అంటే ఇలాగే ఉంటుంది, అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు