MLA Gadde Ramamohan: సమర్థవంతం అంటే పార్టీలు మారడమా?.. కేశినేని నానిపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఫైర్ కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థవంతం అంటే పార్టీలు మారడమా? అంటూ ప్రశ్నించారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు టీడీపీపై మాట్లాడటం సమంజసం కాదని హెచ్చరించారు. By Jyoshna Sappogula 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP MLA Gadde Ramamohan: కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సమంజసం కాదని విజయవాడ తూర్పు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమర్థవంతం అంటే పార్టీ లు మారడమా? అంటూ ప్రశ్నించారు. 'నాకు రాజకీయ తల్లి తెలుగుదేశం. నేను టిక్కెట్ ఇవ్వలేదని గన్నవరం నుండి ఇండిపెండెంట్ గా గెలిచాను. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనంలో కూడా నేను ఇండిపెండెంట్ గా గెలిచాను' అని అన్నారు. ఎంత కెటాయించారు? విజయవాడని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని అన్నారు. ఎన్నికలలో గెలిచిన తరువాత ఏపీ రాజధాని విజయవాడ చెప్పారని.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం మూడు వందల కోట్లు కేటాయించేవారని కేశినేని నాని గుర్తు పెట్టుకొవాలన్నారు. ఇప్పుడు వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయవాడకు ఎంత బడ్జెట్ కెటాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ లకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి వైసీపీ ప్రభుత్వానిదని విమర్శించారు. Also Read: ఎంపీ బాలశౌరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా.! గుర్తులేదా..? కృష్ణలంకలో ప్రజలు ఈ రోజు సంతోషంగా ఉంటున్నారంటే చంద్రబాబు చేసిన ఘనతేనన్నారు. 'రక్షణ గోడ నిర్మించారు.. అనేక మార్లు ఈ గోడ కోసం నిరసన కార్యక్రమాలు చేశాం.. దుర్గగుడి వద్ద ప్రజలు ఇబ్బందులు పెడుతుంటే దుర్గగుడి వద్ద ఫైఓవర్ నిర్మించాలని అనేక అందోళని చేశాం.. ఇవన్నీ మీకు గుర్తులేదా..?' అని కేశినేని నానిని ప్రశ్నించారు. మీకే నష్టం.. చంద్రబాబు ఒక కార్యక్రమం చేయాలంటే వాటి పై పూర్తిగా దృష్టి పెట్టి చేస్తారని.. కేశికేని నాని.. అన్ని తెలిసి కూడా తెలుగుదేశం పార్టీ పై అబద్దాలు చెప్పడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని.. కేశినేని నాని ఇలా మాట్లాడం వల్ల తనకే నష్టం అని చెప్పుకొచ్చారు. కామెంట్ చేసే ముందు వ్యక్తి గురించి తెలుసుకుని కామెంట్ చేయాలని కేశినేని నానికి హెచ్చరించారు. కేశినేని నాని వైసీపీలో జాయిన్ అయిన వేంటనే 60% ఖాళి అవుతుందన్నారని..అయితే, అతను పార్టీ మారిన తరువాత వైసీపీనీ మేమే కాలి చేస్తున్నమని కామెంట్స్ చేశారు. #kesineni-nani #mla-gadde-ramamohan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి