Pawan Kalyan: ఎంపీ బాలశౌరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా.! జనసేన అధినేత పవన్‌తో ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ బాలశౌరి త్వరలో జనసేన కండువా కప్పుకోనున్నారు. బందరు లేదా గుంటూరు ఎంపీ సీటు బాలశౌరి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కూడా కచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. By Jyoshna Sappogula 19 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ New Update షేర్ చేయండి MP Balashowry : జనసేన అధినేత పవన్‌తో (Pawan Kalyan) ఎంపీ బాలశౌరి భేటీ అయ్యారు. ఇటీవలే బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన త్వరలోనే జనసేన పార్టీలో (Janasena Party) చేరుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ నెల 21న ఆయన జనసేన గూటికి చేరుతున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తాజాగా, ఆయన హైదరాబాద్‌లో పవన్‌తో చర్చలు జరిపారు. బందరు ఎంపీ సీటు లేదా గుంటూరు ఎంపీ సీటు బాలశౌరి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనాని పవన్ కూడా కచ్చితంగా సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలశౌరి రాకతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. *రండి.. కదలిరండి.. జన ప్రభంజనంతో ఏకం అవుదాం!* మచిలీపట్నం *ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు జనసేన పార్టీలో చేరుతున్న సందర్బంగా *అవనిగడ్డ నియోజకవర్గంలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆశీస్సుల కోసం విచ్చేయనున్నారు.* *తేదీ, సమయం : 21-01-2024(ఆదివారం), ఉదయం : 10:30 గంటలకు* *@టీం… pic.twitter.com/OKO1LPCBR7 — Vallabhaneni Balashowry (@VBalashowry) January 17, 2024 ఏపీ అధికార పార్టీ వైసీపీ సిట్టింగులను మార్చడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంపీ బాలశౌరి ఆ పార్టీకి రాజీనామ చేశారు. తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని బాలశౌరి (Balashowry Vallabbhaneni) గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఎంపీ బాలశౌరికి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, పెడన ఎమ్మెల్యే, మంత్రి జోగి రమేష్ కు మధ్య ఉన్న విభేదాలు కూడా పార్టీని వీడడానికి కారణమని తెలుస్తోంది. Also Read: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పదవీ బాధ్యతల స్వీకరణ షెడ్యూల్ ఇదే.! దీనికి తోడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విందుకు బాలశౌరి హాజరు కావడం సీఎం జగన్ కు నచ్చలేదట. ఆ విందు తర్వాత బాలశౌరికి సీఎం జగన్ క్లాస్ పీకి టికెట్ లేదన్నారట. ఇందుకే, జనసేనలోకి వెళ్లాలని ఎంపీ బాలశౌరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. #mp-balashowry #janasena-chief-pawan-kalyan #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి