TDP : ఉత్కంఠగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!

గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలెక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. బై బై జగన్ అంటూ నినాదాలు చేశారు.

New Update
TDP : ఉత్కంఠగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు..వాకౌట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..!

TDP Leaders Protest : ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఒకవైపు అసెంబ్లీలో చర్చలు నడుస్తుంటే మరోవైపు టీడీపీ(TDP) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ఆందోళన చేపట్టారు. గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) ప్రసంగంలో అన్నీ అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలేక్కడ అంటూ సభలో నిలబడి ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ నుండి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.

Also Read: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..!


టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు పట్టుకుని, నడుకుంటూ అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు. బైబై జగన్(Bye Bye Jagan) అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్, పోలవరం ప్రాజెక్ట్(Polavaram Project) పూర్తి ఎక్కడ అని వైసీపీ(YCP) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు ఎక్కడ అంటూ నిరసనలు చేస్తూ బయటికి వచ్చారు.

Also Read : టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు..ఇన్ని ఇవాల్సిందే అంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..!

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో నెంబర్ వన్ గా మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 175 సీట్లు అడిగే అర్హత జగన్ కు లేదని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. ఏపీ ప్రజల్ని మరొక సారి మోసం చేయడానికి ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు గవర్నర్ ను వాడుకుందన్నారు. ఈ ప్రభుత్వం రైతును మర్చిపోయింది కానీ..ప్రసంగంలో మాత్రం గవర్నర్ తో  రైతుల గురించి చదివించారని కామెంట్స్ చేశారు. గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు తో కూడుకుంది కాబట్టి టీడీపీ బాయ్ కాట్ చేసిందని వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు