AP: MPDO కార్యాలయం ఎదుట ఉద్రిక్తత.. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ టీడీపీ నిరసన..! అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం MPDO కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు రాజీనామా చేయాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం ఎన్నికలు జరపకుండా ఎంపీటీసీలను ఎన్నిక చేసిందని మండిపడ్డారు. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 07 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Kadapa: అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం MPDO కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. గో బ్యాక్ ఎంపీటీసీ అంటూ టీడీపీ కార్యకర్తలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పాపాల పెద్దిరెడ్డి గత ప్రభుత్వంలో అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలు జరపకుండా నియోజకవర్గ వ్యాప్తంగా ఏకగ్రీవం చేసి ఎంపీటీసీలను ఎన్నుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు! గత ప్రభుత్వంలో వైసీపీ ఎంపీటీసీలు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాదని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వీరు ఎంపీటీసీ సభ్యులుగా అనర్హులని, వీరందరూ వెంటనే రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లి, ప్రజల చేత ఎన్నుకోబడి మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. లేనిపక్షంలో సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటామని టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. Also Read: హోంమంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ ఇవాళ జరగాల్సిన సర్వసభ్య సమావేశాన్ని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకుంటారని.. ముందస్తుగా ఐదు గంటలకే ఎంపీడీవో కార్యాలయంలోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు. ఈ క్రమంలోనే నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ జయ చంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. #kadapa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి