బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందే.! విశాఖ షిప్పింగ్ హార్బర్ ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ అధీనంలో ఉన్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. By Jyoshna Sappogula 21 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP Leaders: విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు టిడిపి నేతలు. దెబ్బతిన్న బోట్ల దుస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి విశాఖ అధ్యక్షులు వల్ల శ్రీనివాస్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు , దక్షిణ ఇన్చార్జి గండి బాబ్జి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Also Read: విశాఖ షిప్పింగ్ హార్బర్ బాధితులకు అండగా జనసేనాని.! మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ..అగ్ని ప్రమాదంలో 36 కోట్లు పైగా నష్టం జరిగిందిని తెలిపారు. ప్రభుత్వ అధీనంలో వున్న హార్బర్ కు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు వందకు వందశాతం నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వరంగ మత్స్య సంస్ధల నుంచి కూడా సహాయం అందించాలని కోరారు. అనంతరం, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడారు. బోటు పనిచేసే ప్రతి ఒక్కరికీ నెలకు రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోటు కట్టాలంటే 6 నుంచి 7 నెలలు పడుతుందని..ఒక బోటుపై 30 మంది బతుకుతారని..వారందరికీ న్యాయం చేయాలని కోరారు. Also Read: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో మరో కొత్త కోణం.. నాని ఏం చెప్పాడంటే ఈ క్రమంలోనే ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటి సారని తెలిపారు. బోట్ యజమానుల బాధలు తెలుసుకున్నామని చెప్పారు. అయితే, ప్రభుత్వం 80 శాతం నష్టం ఇస్తానంటోందని..కానీ, ఇతర అనుబంధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బోట్ లో వున్న సామగ్రికి కూడా లెక్కకట్టాలని జేడి ఫిషరీస్ కు చెప్పామని వెల్లడించారు. శాశ్వతంగా కోలుకునేలా ఎలాంటి షరతులు లేకుండా ఉదారంగా సహాయం చేయాలని అభ్యర్థించారు. వివక్ష లేకుండా విలువకట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు గండి బాబ్జీ. రైల్ ప్రమాదం జరిగినపుడు ఒక లాగా..ఈ ప్రమాదంకు ఒక లాగా నష్టపరిహారం వుండకూడదని అన్నారు. బాధితులకు పూర్తి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. #andhra-paradesh #tdp-leaders #vishaka-harbour మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి