జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు టీడీపీ ముఖ్య నేతలు అత్యవసరంగా భేటీ కావాలని నిర్ణయించారు. మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ లో సమావేశమై.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, కేసుల విషయంపై చర్చించనున్నారు. కోర్టుల్లో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు సమీక్ష నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సెంట్రల్ జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు వైద్యులు వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదల చేశారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బీపీ- 140/80
టెంపరేచర్- నార్మల్
పల్స్- 87
Spo2- 97
లంగ్స్- క్లియర్
ఫిజికల్ యాక్టివిటీ- గుడ్
చర్మ సంబంధిత నిపుణులు సైతం చంద్రబాబును పరీక్షించారు. అనంతరం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.
ఈ వార్త అప్డేట్ అవుతోంది..