TDP: తిరుపతిలో జనసేన అభ్యర్థిని మార్చాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై అది నాయకులు స్పందించకుంటే తాము పార్టీని విడుతామని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తిరుపతిలోని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటివద్ద టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై CEO కీలక వ్యాఖ్యలు.. అలా ఉంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే..!
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. గెలిచే అభ్యర్థిని కాదని, ఓడిపోయే వారికి సీటు కేటాయించారని ఆరోపిస్తున్నారు. తిరుపతికి వస్తున్న లోకేష్ కు విన్నవించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. అధిష్టానం గుర్తించకుంటే పార్టీని వీడేందుకు సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఆరని శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.