Lokesh: పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. లోకేష్ ట్వీట్!

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత లోకేష్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం జగన్ విఫలం అయ్యారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు లోకేష్.

AP Mega DSC : మెగా డీఎస్సీలో సిలబస్ మార్పు.. మంత్రి లోకేష్ ఏమన్నారంటే!
New Update

Lokesh Tweet : ఏపీలో సీఎం జగన్(CM Jagan) పాలనను ప్రశ్నిస్తూ టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ ఉద్యమానికి ప్రేరేపించేలా శ్రీశ్రీ రాసిన ఉద్యమ పిలుపును జోడిస్తూ లోకేష్(Nara Lokesh) ట్విట్టర్(X) లో వైసీపీ(YCP) ప్రభుత్వంపై నిప్పుపై చెరిగారు. ఆయన ట్విట్టర్ లో.. 'పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టిడిపి పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నాను.' అంటూ రాసుకొచ్చారు.

'గత ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడం శోచనీయం. మినిమమ్ టైం స్కేల్ విషయంలో జీవోల మీద జీవోలు ఇచ్చి అమలు చేయకపోవడం, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే చర్యలకు పాల్పడటం దారుణం. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలియజేస్తోంది. సమగ్ర శిక్షా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి.' అంటూ మరో ట్వీట్ చేశారు.

#lokesh #cm-jagan #andhra-pradesh-elections-tdp #ycp-party #ap-latest-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe