ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిపై మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. మంగళవారం విజయనగరంలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..కొడాలి నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకు వస్తాడు: బుద్ధా వెంకన్న
గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకి వచ్చి మాట్లాడతాడంటూ ఆరోపణలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు.
Translate this News: