కొడాలి నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకు వస్తాడు: బుద్ధా వెంకన్న

గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకి వచ్చి మాట్లాడతాడంటూ ఆరోపణలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు.

New Update
TDP Buddha Venkanna: చంద్రబాబు, పవన్ పై చెడుగా మాట్లాడే కుక్కల తాట తీస్తా.. బుద్దా వెంకన్న వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిపై మరోసారి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న. మంగళవారం విజయనగరంలో బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. గంజాయి మత్తులో కొడాలి నాని ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శించారు. గంజాయి తాగిన నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. కొడాలి నాని మనస్తత్వం నక్క లాంటిది అని ధ్వజమెత్తారు. కొడాలి నాని ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని వార్నింగ్ ఇచ్చారు.

మాజీ మంత్రి కొడాలి నాని వ్యవహార శైలి నచ్చకనే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు పంపినట్లు తెలిపారు. నానికి పేమెంట్ ఇస్తేనే మీడియా ముందుకి వచ్చి మాట్లాడతాడంటూ ఆరోపణలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ కుటుంబంలో తగువులు సైతం పెట్టారని మండిపడ్డారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 78 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మార్చిన చరిత్ర వైసీపీది అని విమర్శించారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ ‌ను గంజాయి ఆంధ్రప్రదేశ్‌ గా మార్చిన చరిత్ర వైఎస్ జగన్‌ది అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ ఆయన కేబినెట్‌ లోని మంత్రులు, అండగా ఉన్న నేతలంతా దోచుకోవడం, దాచుకోవడంపై ఫోకస్ పెట్టారని చెప్పుకొచ్చారు. పుంగనూరు ఘటనలో కావాలనే వైసీపీ దాడులు చేసిందని చంద్రబాబుని అన్ని విధాలా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే దాడులు చేశారని ఆరోపించారు.

చంద్రబాబు పర్యటనని ఈ సారి ఎవరైనా అడ్డుకుంటే తాము అడ్డుకుంటామని దాడులకు ప్రతిదాడులు చేస్తామన్నారు. హింసను ప్రేరేపిస్తూ ప్రతిపక్ష పార్టీలను రోడ్డు ఎక్కనీయకుండా అడ్డుకుంటున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న.

Advertisment
తాజా కథనాలు