Vishaka :'నాలుగున్నరేళ్ళ తరువాత జగన్ ఇందుకే వచ్చాడు'

సీఎం జగన్ పై మాజీ మంత్రి కిడారి శ్రవణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ళ తరువాత జగన్ గిరిజన ప్రాంతానికి వచ్చారని.. ఏమైనా మంచి చేస్తారేమో అని ప్రజలు భావించారన్నారు. కానీ జగన్ గనుల సర్వే కోసమే వచ్చినట్లు అనిపిస్తుందన్నారు.

New Update
Vishaka :'నాలుగున్నరేళ్ళ తరువాత జగన్ ఇందుకే వచ్చాడు'

TDP Kidari Sravan Kumar comments: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో సీఎం జగన్ పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్ లు పంపిణీ చేశారు. అయితే, సీఎం జగన్ పై మాజీ మంత్రి కిడారి శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ళ తరువాత సీఎం జగన్ గిరిజన ప్రాంతానికి వచ్చారని..సీఎం బర్త్ డే సందర్బంగా వచ్చారు కదా మా ప్రాంతానికి ఏమైనా మంచి చేస్తారేమో అని గిరిజనులు ఆలోచించారని..కానీ జగన్ వచ్చింది ప్రజలకు మంచి చెయ్యాలని కాదని గనుల సర్వే కోసం సీఎం వచ్చారని అనిపిస్తుందన్నారు. పిల్లలకు ట్యాబ్స్ పంచుతామని వారందరినీ పిలిపించి కనీసం భోజనం కూడా పెట్టకుండా సీఎం పుట్టినరోజు కానుక ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: వైసీపీకి బిగ్ షాక్..జనసేన లోకి ఎమ్మెల్యే ?

జీవో నెం 3ను సుప్రీం కోర్టు కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా ఈ ప్రభుత్వం వెయ్యలేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మల్లిస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఉచితంగా గిరిజన పిల్లలను చదివించామని..మా హయాంలో మేము సబ్ ప్లాన్ నిధులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ విసిరారు.
మీరు ఖర్చు పెట్టిన సబ్ ప్లాన్ నిధులపై చర్చకు రావాలని సవాల్ చేశారు.

గిరిజన ప్రాంతాల్లో డోళీ మోతలు పెరిగిపోయాయని..టీడీపీ హయాంలో బైక్ అంబులెన్సు ద్వారా రోగులను తరలించేవాళ్ళమని..ఈ ప్రభుత్వంలో కనీస సౌకర్యాలకు కూడా గిరిజనులు దూరం అయిపోతున్నారని ధ్వజమెత్తారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లన్నీ టీడీపీ హయాంలో వేసినవేనన్నారు. అరకు, పాడేరు ప్రాంతంలో ఒక్క గిరిజనుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు. కనీసం అరకు, లంబశింగి పర్యాటక ప్రాంతాలను కూడా పట్టించుకోలేదని గిరిజన కార్పొరేషన్ కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు