TDP-JSP Manifesto: మేనిఫెస్టోపై కనిపించని బీజేపీ నేతల ఫొటో ... హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా?

టీడీపీ కూటమి మేనిఫెస్టోపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫొటో కనిపించకపోవడంతో వైసీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది. బీజేపీ నేత సిద్ధార్థనాధ్‌సింగ్‌ మేనిఫెస్టో కాపీని తీసుకోకపోవడంతో కూటమి హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

New Update
TDP-JSP Manifesto: మేనిఫెస్టోపై కనిపించని బీజేపీ నేతల ఫొటో ... హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా?

TDP, Janasena Manifesto: టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. మేనిఫెస్టోపై బీజేపీ నేతల ఫొటో కనిపించలేదు.  అంతేకాకుండా, మేనిఫెస్టో విడుదల సందర్భంగానూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ నేత సిద్ధార్థనాధ్‌సింగ్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను ఇస్తున్నా సిద్ధార్థనాధ్‌ సింగ్‌ వద్దంటూ నిరాకరించారు. తమ మేనిఫెస్టోను జాతీయ స్థాయిలో విడుదల చేశామన్నారు. అయితే, ఈ విషయంపై వైసీపీ సోషల్ మీడియా తెగ ట్రోల్స్ చేస్తోంది. కూటమి హామీలకు బీజేపీ గ్యారెంటీ లేదా? అనే అనుమానం వ్యక్తం చేస్తోంది.

Also Read: కూటమి మేనిఫెస్టో విడుదల.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. నిరుద్యోగ భృతి రూ. 3వేలు

ఇదిలా ఉండగా, మేనిఫెస్టో విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బీజేపీ సలహాలను కొంత వరకు తీసుకున్నామన్నారు. అయితే, రాష్ట్ర స్థాయిలో మేనిఫెస్టోతో బీజేపీ అసోసియేట్‌ కావడం లేదని తెలిపారు. కానీ, హామీల అమలుకు పూర్తి సహకారం ఉంటుందని.. ఆదరిస్తారన్న నమ్మకం ఉందని  చంద్రబాబు వెల్లడించారు. మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకుంటుందన్నారు.

Also Read: ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు రచ్చ.. ఫ్రీ సింబల్‌గా చేర్చడంపై జనసేన అభ్యంతరం..!

అయితే, మేనిఫెస్టో ప్రకటన పోస్టర్‌పై బీజేపీ నేతల ఫొటోలు కనిపించకపోవడం, మేనిఫెస్టో ప్రకటన విడుదలలో కూడా ఆలస్యంగా జరిగడం.. సిద్ధార్థనాధ్‌ సింగ్‌తో భేటీ అయిన చంద్రబాబు, పవన్‌.. బీజేపీ సలహాలు తీసుకునేందుకే ఆలస్యమనే చర్చ నడుస్తోంది. మధ్యాహ్నం 12.30కే మేనిఫెస్టో విడుదల అంటూ సమాచారం ఉన్నా.. రెండున్నర గంటలు ఆలస్యంగా మేనిఫెస్టో విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు