TDP Chintamaneni Prabhakar: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టిడిపి జనసేన పార్టీలలో ముసలం నెలకొంది. చింతమనేనికి వ్యతిరేకంగా ఏలూరులో సమావేశమైయ్యారు టిడిపి జనసేన నాయకులు. ప్రజా వ్యతిరేకి చింతమనేని వద్దు- ఎవరైనా ముద్దు అంటూ ఏలూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.
Also Read:వైసీపీకి రాజీనామా.. ఎమ్మెల్యే పెండెం దొరబాబు క్లారిటీ
2024 ఎన్నికల్లో చింతమనేని తప్ప టిడిపి జనసేన తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఇంకెవరినైనా ప్రకటించాలంటూ తీర్మానం చేశారు. టిడిపిలో బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గమే చింతమనేని వ్యతిరేకిస్తోందంటున్నారు నాయకులు. గతంలో ఆయన చేసిన దారుణాలకు ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని కొత్త అభ్యర్థి వస్తేనే తాము మద్దతు ఇస్తామంటూ తెల్చి చెబుతారు జనసైనికులు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కి మరోసారి సీటిచ్చే యోచనలో పార్టీ అధిష్టానం ఉందనే సమాచారంతో టీడీపీ, జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేశారు.
Also Read:నయనతార కాపురంలో చిచ్చురేపిన వేణుస్వామి.. విడాకులు తప్పవంటూ
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు వివాదాస్పద నాయకుడిగా పేరుంది. రౌడీ ఎమ్మెల్యేగా ముద్రపడటమే దీనికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. దెందులూరు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఆయన ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. నోటి దురుసుకు అయితే అడ్డూ అదుపూ ఉండదని నియోజకర్గంలోని పలువురు ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీంతో ఆయనకు తప్ప సీటు ఎవ్వరికి ఇచ్చిన మద్దతూ తెలుపుతామని ఖరకండిగా చెప్పేస్తున్నారు పలువురు జనసైనికులు.